1000 మందికి సాంబార్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు: బియ్యం 65 కేజీలు, కందిపప్పు 20 కేజిలు , ఐదు రకాల కూరగాయలు
70 కేజీలు (బంగాళదుంపలు, సొరకాయ, ముల్లంగి, వంకాయ, క్యారెట్, మునక్కాయలు), ఉల్లిపాయలు 12 కేజీలు, టమాటాలు 15 కేజీలు,
చింత పండు 5 కేజీలు, సాంబార్ పొడి 3 కేజీలు , 5 కేజీలు నూనె, 2 కేజీల నెయ్యి, పావుకిలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 200 గ్రాముల ఎండుమిర్చి, కేజీ పచ్చిమిర్చి, 100 గ్రాముల ఇంగువ, 250 గ్రాముల పసుపు, అరకిలో కరివేపాకు, 2 కేజీల కొత్తిమీర, సరిపడా ఉప్పును తీసుకోవాలి.
ఒక పెద్ద గిన్నెలో రెగ్యులర్ బియ్యం, ఒక కప్పు కందిపప్పు తీసుకోండి. వీటిని తగినన్ని నీళ్లు పోసి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఈ మిశ్రమంలో తగిన నీళ్లు పోసి, మీడియం ఫ్లేమ్‌లో ఉంచి దీనిని బాగా ఉడికించుకోవాలి. మెత్తగా రావాలి అనుకుంటే ఎక్కువ సేపు ఉడికించుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత, పప్పు-బియ్యాన్ని మెత్తగా ఎనపకుండా, పెద్ద గరిటెతో మెల్లగా కలిపి పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద గిన్నెలో చింతపండును తీసుకొని, అది మునిగేంత వరకు నీళ్లు పోసి నాననివ్వండి. మీకు నచ్చిన కూరగాయ ముక్కలను బంగాళదుంప, క్యారెట్, బఠాణి, క్యాలీఫ్లవర్, బీన్స్ వంటివి కట్ చేసి సిద్ధంగా పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక పెద్ద కళాయిలో నూనె వేసి వేడి చేయండి. నూనె కాగిన తర్వాత అన్ని పావుకిలో చొప్పున ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వండి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్‌గా వేయించుకోండి. తరువాత పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, ఇంగువ వేసి వేయించాలి. సాంబార్ రైస్‌కు ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు ఆకులు కూడా వేసి వేయించుకోవాలి.
కరివేపాకు కూడా వేగిన తర్వాత, టమాటా ముక్కలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేయండి. మీ రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసి, మీడియం ఫ్లేమ్‌లో ఐదు నిమిషాలు కూరగాయ ముక్కలన్నింటినీ బాగా వేయించుకోండి. కూరగాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత, కారం వేసి కలపాలి. కారం కలిపిన తర్వాత, నానబెట్టిన చింతపండు నుండి తీసిన రసం నీళ్లు పోసుకోవాలి. చింతపండు రసం మరీ ఎక్కువగా పోయకుండా చూసుకోండి, పులుపు ఎక్కువైతే రుచి అంత బాగుండదు. నీళ్లు పోసిన తర్వాత మరోసారి రుచికి సరిపడా ఉప్పు, సాంబార్ పొడి వేసి బాగా కలపాలి. దీనిని మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టి 20 నిమిషాలు మరిగనివ్వండి.
ఐదు నిమిషాల తర్వాత మూత తీసి, ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు-బియ్యం మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. కలిపేటప్పుడు ఫ్లేమ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచండి. రైస్ మొత్తం మసాలా మిశ్రమంలో బాగా కలిసిపోయేలా కలుపుకోండి. ఒకవేళ సాంబార్ రైస్ గట్టిగా అనిపిస్తే, కొద్దిగా వేడి నీళ్లు పోసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి, లో ఫ్లేమ్‌లో మూడు నుండి నాలుగు నిమిషాలు ఉడికించండి. మూడు-నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే, సాంబార్ రైస్ సరైన విధంగా ఉడికి ఉంటుంది. మరీ పల్చగానూ, మరీ గట్టిగానూ కాకుండా, చల్లబడిన తర్వాత కూడా తినడానికి మంచిగా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసి, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి బాగా కలిపితే కమ్మటి సాంబార్ రైస్ రెడీ. వేడివేడి సాంబార్ రైస్‌లో కొద్దిగా నెయ్యి వేసి నేరుగా తింటే చాలా రుచిగా ఉంటుంది. లేదా, వడ్డించేటప్పుడు కొద్దిగా నేతిలో ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించి, సాంబార్ రైస్ పైన వేసి ఇస్తే ఆ ఫ్లేవర్ ఇంకా అద్భుతంగా ఉంటుంది.




