Reading Time: 2 minutes

New Movies: నాని ‘ది పారడైజ్’తో పోటీ కాదు.. మా సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: హీరో ఖాన్ దురాని

Caption of Image.

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది పారడైజ్’ సినిమా ఈ నెల 24న రిలీజ్ కానుంది. ఈ పాన్ ఇండియా సినిమాతో పాటుగా ‘కళ్యాణం కమనీయం జీవితం’ అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కూడా రానుంది. వచ్చే శుక్రవారం (సెప్టెంబర్ 25న) ‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ  థియేటర్లలోకి రాబోతోంది. ఈ రెండు సినిమాలు ఒకరోజు వ్యవధిలో విడుదల కానుండటంపై హీరో ఖాన్ దురాని స్పందించారు.

నాని అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన సినిమాతో పాటే తన చిత్రం విడుదల కావడం సంతోషంగా ఉందని తెలిపారు. తాము ఎవరికీ పోటీగా వెళ్లడం లేదని, ‘కళ్యాణం కమనీయం జీవితం’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించనుందని చెప్పారు.

వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కళ్యాణం కమనీయం జీవితం’. రవి లోకిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మూవీ ఈ నెల 25న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. 

సినిమా చిన్నదైనప్పటికీ కంటెంట్ చాలా పెద్దదని, ప్రదర్శించిన ప్రత్యేక ప్రివ్యూలో అందరూ చిత్రాన్ని బాగా మెచ్చుకున్నారని నిర్మాత పైలా ప్రసాద్ రావు తెలిపారు.  ఫ్యామిలీ ఆడియన్స్, యూత్‌ను ఆకట్టుకునేలా చక్కటి ఎమోషన్స్‌తో సినిమాను తెరకెక్కించామని దర్శకుడు రవి లోకిరెడ్డి, రైటర్ అరవింద్ ఏకలవ్య అన్నారు. రూ.100 పెట్టి టికెట్ కొన్న ప్రేక్షకులు ఖచ్చితంగా దానికి తగిన ఎంటర్‌టైన్మెంట్ పొందుతారని.. సినిమాలో ఆధ్యంతం ఆసక్తికరమైన ట్విస్టులు ఉంటాయని దర్శకుడు రవి లోకిరెడ్డి వెల్లడించారు.

నాని అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన నటిస్తున్న ‘పారడైజ్’ సినిమాతో పాటే తన ‘కళ్యాణం కమనీయం జీవితం’ కూడా వస్తుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు హీరో ఖాన్ దురాని. ఎవరికీ పోటీగా తాము వెళ్లడం లేదని, ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని అన్నారు. హీరోయిన్ సాహితి ఆవంచ, కీలక పాత్రలో నటించిన విషిక మాట్లాడుతూ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నామని, కష్టపడి చేసిన సినిమాను ఆడియెన్స్ ఆదరించి సక్సెస్ చేయాలని కోరారు.

©️ VIL Media Pvt Ltd.