Reading Time: 2 minutes

Baby care: పసి పిల్లలకు పాలు పట్టించిన తరువాత చేయాల్సింది ఇదే.. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు..!

Caption of Image.

పసి పిల్లల్లో కండరాలు, అవయవాలు అంత గట్టిగా ఉండవు. కాబట్టి వాళ్లను ఎత్తుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేక పొజిషన్లు ఉంటాయి. చిన్నారికి పాలు పట్టటం కూడా కష్టమైన పనే. కానీ పాలు పట్టేశాక.. ప్రతి తల్లి లేదా తండ్రి తప్పక చేయాల్సిన పని వాళ్లు తేన్పేలా చూడటం. అప్పుడే బేబీ శరీరంలో అదనంగా ఉన్న గాలి బయటకి వెళ్లిపోతుంది. ఆహారం తీసుకున్నాక బేబీ తేన్చకపోతే, తాగిన పాలను వాంతి చేసుకోవచ్చు.

  • చంటి పిల్లల ప్రతి తేన్పులో ఒక  అర్థం ఉంటుంది. చాలామంది  అమ్మానాన్నలకు ఆ అవగాహన ఉండదు.   నిజానికి తేన్పులు బేబీ కడుపులో ఇరుక్కున్న గాలిని బయటకి పంపించి, వాళ్లకు చిరాకు లేకుండా సౌకర్యంగా ఉండేలా చేస్తాయి.. దానివల్ల కడుపులో ఎక్కువ చోటు ఖాళీ అయ్యి, మరిన్ని పాలకు చోటు ఉంటుంది. తరచూ వాంతులు చేసుకునే లేదా గాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్న పిల్లలకు ఎక్కువసార్లు కొద్దికొద్ది ఆహారం అందిస్తూ… తేన్పులు వచ్చేలా చేయటం మంచిది.
  • పిల్లలకు పాలు తాగించాక భుజం మీద ఏదైనా క్లాత్ లేదా టవల్ వేసుకుని, బేబీని పడుకోబెట్టాలి. తర్వాత చిన్నగా అటూఇటూ నడవాలి. ఒకవేళ బేబీ వాంతి చేసుకున్నా, ఉమ్మినా బట్టలు పాడవ్వకుం డా ఉంటాయి.
  • పసిబిడ్డను భుజంపై ఎత్తుకున్నా, ఒడిలో పడుకోబెట్టినా… బేబీ తల ఎత్తేలా చూసు కోవాలి. అలాగే మన చేతిని బేబీ నడుముదగ్గర వేసి, ఇంకో చేత్తో వీపు పై మెల్లగా జో కొట్టాలి. కొందరు పిల్లలకు ఊగే కుర్చీలో పడుకోవడం అలవాటు అవుతుంది. అది అలా మెల్లిగా ఊగుతూ ఉంటే తేన్చే పని కూడా సులభంగా అవుతుంది.
  • బేబీ వీపుపై నెమ్మదిగా తట్టాలి లేదా రుద్దాలి. తర్వాత బేబీని ఒడిలో మెల్లిగా గడ్డం దగ్గర ఒక చేయి. చాతీ దగ్గర ఇంకో చేయి వేసి పట్టుకుని నిలువుగా కూర్చోబెట్టాలి. ఇలా చేస్తున్నప్పుడు చేయిని బిడ్డ గొంతు దగ్గర గట్టిగా నొక్కుకోకుండా చూసుకోవాలి.
  • ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు పాలు తాగాక లేదా ఆహారం తిన్నాక ఒడిలో బోర్లా పడుకో బెట్టుకోవద్దు. పాపాయి తల మీ కాళ్లకు పైన బయటికి ఉండేలా చూసుకోవాలి. పిల్లల గడ్డం.. చాతీకన్నా కొంచెం ఎత్తులో ఉంచాలి. ఈ స్థితిలో బేబీ వీపును ఆపకుండా తడుతూ ఉండాలి. ఈ పని పెద్దలకు కొంచెం అలసటగా అనిపించొచ్చు. కానీ పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే తప్పదు.
©️ VIL Media Pvt Ltd.