
అంతర్జాతీయంగా వస్తున్న ఆర్థిక, భౌగోళిక మార్పులు బులియన్ మార్కెట్లను పరుగులు పెట్టిస్తున్నాయి. డాలర్ బలహీనత కొనసాగుతున్న వేళ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఊహించని రీతిలో రియాక్ట్ అవుతూ సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. దీంతో దసరా నాటికి రేట్లు ఇంకా పెరుగుతాయా అనే ఆందోళనలు చాలా మందిని వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు షాపింగ్ చేయాలని అనుకుంటున్నట్లయితే ముందుగా తమ నగరాల్లో పెరిగిన ధరలను పరిశీలించటం ముఖ్యం.
సెప్టెంబర్ 18న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ 17 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.158 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 442గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 155గా కొనసాగుతోంది.
ALSO READ : BHEL సోలార్ ప్లాంట్‌లో 32 కేజీల వెండి మాయం..
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 18, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.2లక్షల 50వేలుగా మార్పు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.250 దగ్గర ఉంది.