Reading Time: < 1 minute

Rao Bahadur OTT Release: ఓటీటీలోకి ‘రావు బహదూర్’.. సత్యదేవ్ సైకాలజికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?

Caption of Image.

టాలీవుడ్ నటుడు సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్ లో వచ్చిన సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’.  భారీ అంచనాలతో ఈ మూవీ జూలై 3న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం  కథనం, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లే, భావోద్వేగాలతో కూడిన మానసిక సంఘర్షణల ప్రదర్శనకు ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా సత్యదేవ్ తన పాత్రలో చూపించిన తీవ్రత, భావవ్యక్తీకరణ ప్రేక్షకులను కట్టిపడేసింది.

అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ లో వెనుకబడింది. ఆశించిన స్థాయిలో వసూల్లు రాబట్టలేకపోయింది. థియేటర్లలో మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం జూలై 31 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించడంతో సినిమా అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ఈ ‘రావు బహదూర్’ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది. దీంతో దేశవ్యాప్తంగా మరింత విస్తృత ప్రేక్షకాదరణ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేటర్లలో మిస్ అయిన వారు.. అలాగే సైకాలజికల్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మంచి ఛాయిస్‌గా మారనుంది.

►ALSO READ | The Paradise: ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ ఐటమ్ సాంగ్.. ఉర్రూతలూగించిన ఫోక్ సాంగ్తో ఓదెల..!

ఈ చిత్రంలో దీపా థామస్ కథానాయికగా నటించగా, వికాస్ ముప్పాల, బాలా పరసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు వెంకటేష్ మహా తనదైన కథన శైలితో ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇచ్చి సినిమాను ఆసక్తికరంగా మలిచారు. స్మరణ్ సాయి అందించిన నేపథ్య సంగీతం థ్రిల్లింగ్ అనుభూతిని మరింత పెంచింది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, ఈశ్వరన్ విజయరాఘవన్ నిర్మించారు. మరి ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.