Reading Time: < 1 minute
Prabhas Fauji Teaser On Aug 15 Massive Buzz After First Look

Prabhas Fauji Movie Teaser Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటైన ‘ఫౌజీ’ సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ ఏడాది డిసెంబర్ 3న ఫౌజీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్ సినిమాపై ఒక్కసారిగా భారీ హైప్ క్రియేట్ చేసింది. యుద్ధభూమిలో ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయింది. దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్‌ను అంతకుమించి చూపించబోతున్నట్టుగా ఫస్ట్ లుక్‌తో స్పష్టమైంది.

ఇక ఈ సినిమా టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ‘ఫౌజీ’ సినిమా నుంచి టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ టీజర్ కట్ పీక్స్‌లో ఉంటుందని టాక్. ఇక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆమె పాత్ర సినిమాలో కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బ్యాలెన్స్ షూటింగ్‌ను వీలైనంత త్వరగా ఫినిష్ చేయడానికి కసరత్తులు చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలోనే ఫౌజీ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఫౌజీ, స్పిరిట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసేందుకు మరోసారి ప్రభాస్ సిద్ధమవుతున్నాడు.