Reading Time: < 1 minute

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్: భారీగా తగ్గినా బంగారం, వెండి ధరలు!

Caption of Image.

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో  ఈరోజు (28 జులై) మంగళవారం బంగారం ధర పెరిగింది. ఈ వారం అమెరికా వడ్డీ రేట్లపై నిర్ణయం రానుండటంతో, ద్రవ్యోల్బణ భయాలు తగ్గి మంగళవారం బంగారం కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
 
రెండు వారాల ఘర్షణల తర్వాత అమెరికా, ఇరాన్‌లు దాడులను నిలిపివేయడంతో చమురు ధరలు 6% పడిపోయి వారం రోజుల కనిష్ఠానికి చేరాయి. దీనివల్ల హోర్ముజ్ జలసంధిలో నౌకాయానం మళ్లీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుతుంటే, మన దేశంలో మాత్రం రిటైల్ మార్కెట్‌లో పసిడి ధర తగ్గి అస్థిరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అలాగే దేశీయ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు కూడా తగ్గాయి.

1 గ్రాము 24క్యారెట్ల బంగారం   ధర రూ.169 తగ్గి రూ.14,417, 22క్యారెట్ల బంగారం   ధర రూ.155 తగ్గి రూ.13,215, 18 క్యారెట్ల బంగారం   ధర రూ.126  తగ్గి రూ.10,813

10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1750 తగ్గి రూ.1,44,170, 22 క్యారెట్ల ధర రూ.1,550 పడిపోయి రూ.1,32,150, 18 క్యారెట్ల ధర రూ.1,260 తగ్గి  రూ.1,08,130. 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే 

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,44,170, 22 క్యారెట్ల ధర రూ.1,32,150, 18 క్యారెట్ల ధర రూ.1,08,130. 

విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ,  తిరుపతి, కడప, అనంతపురంలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.1,44,170, 22 క్యారెట్ల ధర రూ.1,32,150, 18 క్యారెట్ల ధర రూ.1,08,130. 

వెండి  1 గ్రాము ధర రూ.235తో రూ.5 తగ్గింది. దింతో కిలో వెండి  ధర రూ.2,35,000 వద్ద రూ.5,000 తగ్గింది. 

©️ VIL Media Pvt Ltd.