Reading Time: < 1 minute

బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. కరీంనగర్ జిల్లాలో యువకుడు మృతి..!

Caption of Image.

కరీంనగర్‌లో భార్య వేధింపుల కారణంగా యువకుడు ఆత్మహత్య చెందినట్లు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆదివారం (జులై 05) కేసు నమోదైంది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు కరీంనగర్ రూరల్ పోలీసులు.

కొన్నాళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న 27 ఏళ్ల రాకేష్ ఉరివేసుకుని మృతి చెందడం విషాదాన్ని నింపింది. పుట్టింటి వారిని కలవనివ్వకుండా కోడలు తన కొడుకును మానసిక వేధింపులకు గురిచేసిందని మృతుని తండ్రి ఫిర్యాదు చేశారు. 

ALSO READ : ఇంత నిర్లక్ష్యమా..? హెడ్ లైట్లు లేకుండా 90 కిలోమీటర్లు ప్రయాణించిన బస్సు..! 

బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. BNS సెక్షన్ 108 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

©️ VIL Media Pvt Ltd.