
అయోధ్య రామాలయం నిధులు దుర్వినియోగం కేసులో ఆఫ్ కన్వీనర్ కేజ్రీవాల్, కాంగ్రెస్ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర ప్రతిపక్ష నేతలు చేస్తు్న్న బహిరంగ ఆరోపణలపై వారిని ప్రశ్నించాలని విశ్వహిందూ పరిషత్ అయోధ్య పోలీసులను కోరింది.
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అశుతోష్ తివారికీ ఓ లేఖ రాసింది. ప్రతిపక్ష నేతలను పిలిపించి ప్రశ్నించాలని, వారి వాంగ్మూలం రికార్డు చేయాలని, వారు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు,డాక్యుమెంట్లు కోరాలని వీహెచ్ పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ పోలీసులను కోరారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలకు ఏవైనా ఆధారాలు, సాక్ష్యులుంటే వాటిని ఇవ్వమని చెప్పాలని ఇన్వెస్టిగేషన్ ఆఫసర్లను కోరారు.
ప్రతిపక్ష నేతలు ఆరోపిందేమిటీ?
ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రామాలయంలో చోరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రామాలయంలో శ్రీరాముని పూలమాల, చరణ పాదుకలు, ఆభరణలు, వజ్రాలు, వెండి ఇటుకలు, దీపాలు ఇలా అనేక విలువైన వస్తువులతోపాటు రూ. 200 కోట్ల నగదును దొంగిలించాలని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
మరో ప్రతిపక్ష నేత సమాజవ్ వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ కూడా రామమందిరంలో చోరీపై తీవ్ర విమర్శించారు. భక్తులు విరాళంగా ఇచ్చిన నగుదు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులు దొంగిలించారు, రూ.20వేల కోట్లు భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. జూనియర్ ఉద్యోగులు, రామ జన్మభూమి ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తో పాటు పలుకుబడి ఉన్న వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారని అన్నారు.
రామాలంలో విరాళాలనుంచి 200కోట్లకు పైగా దొంగిలించారని, ఇందులో 50 మందికి పైగా ఉద్యోగులు ఇన్వాల్వ్ అయి ఉన్నారని రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఆరోపించారు.
భూముల కొనుగోళ్ల ఆరోపణలపై సింగ్ ఇప్పటికే సిట్ ముందు హాజరయ్యారు. అయితే వీహెచ్‌పీ ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదని ఆయన స్పష్టం చేశారు.ఇక ప్రియాంక గాంధీ రామాలయం నిధుల చోరీపై స్పందిస్తూ.. ఇందులో పలుకుబడిఉన్న వ్యక్తులు ఉన్నారని ఆరోపించారు.
అయితే ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలను పరిశీలించి, నిరాధారమైన ఆరోపణలు చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ దర్యాప్తు అధికారులను కోరింది.