
భార్య భర్తలు అన్నాక మనస్పర్ధలుంటాయి.. గొడవలుంటాయి.. అవి వాళ్లిద్దరే సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పెద్దల సమక్షంలోనో, కోర్టుల ద్వారానో సెటిల్మెంట్ చేసుకోవడం కామన్. కానీ దంపతుల మధ్య రెండు వైపుల ఫ్యామిలీల్లో ఎవరు అతి చేసినా అది ఎటు దారి తీస్తుందో తెలియదు. ఈ ఘటన కూడా అలాంటిందే. మనస్పర్ధలతో తల్లిగారి ఇంటికి వచ్చిన భార్యను ఒప్పించి ఇంటికి తీసుకెళ్దామని వచ్చిన బావ.. బామ్మర్ది అసహనంతో మంటల్లో కాలిపోవాల్సి వచ్చింది. ఆవేశపరుడైన ఆ యువతి సోదరుడు.. ఆమె జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా.. తను కూడా కటకటాల పాలు కావాల్సి వచ్చింది. పంజాబ్ లో జరిగిన ఈ ఘోర విషాద ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. మనస్పర్ధల కారణంగా భర్తను విడిచి తల్లిగారింటికి వెళ్లిన తన భార్య సందీప్ కౌర్‌ను.. ఇంటికి తిరిగి రమ్మని ఒప్పించేందుకు లవ్‌ప్రీత్ సింగ్ జూన్ 13న అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ అసహనంతో ఊగిపోయిన సాజన్ సింగ్ అనే అతని బామ్మర్ది, లవ్‌ప్రీత్‌పై పెట్రోల్ లేదా డీజిల్ పోసి నిప్పంటించాడు. ఆయిల్ వెంటనే అంటుకుని చూస్తుండగానే కాలి పోయాడు లవ్ ప్రీత్ సింగ్.
►ALSO READ | బాచుపల్లిలో దారుణం.. తాగొద్దు అన్నందుకు భార్యను చంపేసిన భర్త.. సూసైడ్ డ్రామా !
ఈ ఘటనలో సాజన్ సింగ్ వదిన గుర్జిత్ కౌర్, లవ్‌ప్రీత్‌ను కాపాడే ప్రయత్నం చేసింది. పరుగున వెళ్లి సాజన్ ను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె.. లవ్ ప్రీత్ ను కాపాడే ప్రయత్నంలో ఆమెకు కూడా మంటలు అంటుకుని తీవ్రంగా కాలిపోయింది. ఇద్దరినీ స్థానిక ఆసుపత్రిలో చేర్చినప్పటికీ.. చికిత్స పొందుతూ బాధితులిద్దరూ చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ ఘటనలో నిందితుడు సాజన్ సింగ్‌కు గాయాలయ్యాయి, అతడిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు.
ఈ ఘోర ఇన్సిడెంట్ కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ఆన్‌లైన్‌లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా మరో వ్యక్తికి నిప్పంటించడం, ఆ తర్వాత బాధితుడు మంటలను గట్టుకోలేక గిలగిలలాడుతూ అటూ ఇటూ పరుగెత్తడం చూడవచ్చు.
पंजाब के अमृतसर से दिल दहला देने वाली घटना सामने आई है। पत्नी को मनाने पहुंचे एक व्यक्ति पर कथित तौर पर उसके साले ने पेट्रोल डालकर आग लगा दी। गंभीर रूप से झुलसे व्यक्ति की इलाज के दौरान मौत हो गई। घटना का वीडियो सामने आने के बाद मामला चर्चा का विषय बन गया है। पुलिस ने मामले की… pic.twitter.com/kdX6XlRmdL
— सर्वेश कुमार शर्मा (@advocate_sharma) July 4, 2026