
అక్కినేని అఖిల్ కథానాయకుడిగా, టాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వైవిధ్యమైన విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. బిజినెస్ పరంగా కూడా ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన భారీ ప్రీ-రిలీజ్ వేడుకను జూలై 5న తిరుపతిలోని ప్రసిద్ధ నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. చిత్తూరు జిల్లా నలుమూలల నుండి అక్కినేని అభిమానులు భారీ సంఖ్యలో ఈ వేడుకకు తరలిరావడంతో భద్రతా పరమైన జాగ్రత్తలు తీసుకుంది మూవీ టీమ్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అక్కనేని నాగార్జున.. పలువురు డైరెక్టర్స్ సైతం రానున్నారు. ఈ వేడుకను మీరు ప్రత్యేక్ష ప్రసారంలో చూసేయ్యండి.