Reading Time: < 1 minute
Ayodhya Ram Temple Gold Plated Ramcharitmanas Controversy Former Ias Allegation

Ayodhya Ram mandir: అయోధ్య రామమందిరంలో కానుకల దొంగతనంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, రామ మందిరానికి తమ కుటుంబం విరాళంగా ఇచ్చిర రూ. 5 కోట్ల విలువైన బంగారు పూతతో రూపొందించిన రామచరితమానస్ ప్రతిని ఆలయం నుంచి తొలగించినట్లు మాజీ ఐఏఎస్ అధికారి ఎస్. లక్ష్మీనారాయణన్ ఆరోపించడం సంచలనంగా మారింది. తమ కుటుంబం 2024 ఏప్రిల్‌లో బంగారు రామచరితమానస్‌న శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్‌కు విరాళంగా అందించిందని, అయితే అనంతరం దీనిని ఆలయ ప్రాంగణం నుంచి మరోచోటికి తరలించినట్లు ఆయన చెప్పారు.

ఈ విషయంపై ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌ను ప్రశ్నించగా, ఆలయానికి వచ్చే ప్రతీ కానుకను ఆలయంలో ప్రదర్శించడం సాధ్యం కాదని సమాధానం ఇచ్చినట్లు లక్ష్మీనారాయణన్ తెలిపారు. రామాలయ విరాళాల దుర్వినియోగంపై విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ కొత్త ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే యూపీ సర్కార్ అయోధ్య రామమందిర నిధుల గోల్‌మాల్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బంగారు రామచరితమానస్ ఎందుకు తరలించారు.? ఇది ఎక్కడ ఉంది.? అనే అంశాలపై ట్రస్ట్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.