Reading Time: < 1 minute
Gold Price Today Silver Rate Today In India 30 June 2026

బంగారం, వెండి ధరలు ఇటీవలి రోజుల్లో హెచ్చుతగ్గులు చూపిస్తున్నాయి. జూన్‌లో గోల్డ్ ధరలు భారీగానే పడిపోయాయి. ధరలు అంతర్జాతీయ మార్కెట్ (USD), రూపాయి విలువ, భౌగోళిక రాజకీయాలు, డిమాండ్ మీద ఆధారపడి మారుతాయి. నేడు మరోసారి పసిడి ధరలు భారీగా తగ్గాయి. తులం బంగారం ధర రూ.1,800 తగ్గింది. పుత్తడి ధరలు తగ్గుతుండడంతో సామాన్యుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

గత కొన్ని నెలలుగా వేలకు వేలు పెరగడంతో గోల్డ్ అందని ద్రాక్షలా మారుతుందేమో అని కలవరపడని వారుండరు. కానీ ప్రస్తుతం ధరలు దిగొస్తుండడంతో ఊరటచెందుతున్నారు. హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,013, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.12,845, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.10,510గా సేల్ అవుతోంది.

హైదరాబాద్ లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1800 తగ్గి రూ. 1,40,130 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1650 తగ్గి రూ.1,28,450కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,280 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,28,600 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ లో కిలో సిల్వర్ ధర రూ. 100 తగ్గి 2,44,900కి చేరింది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 5000 తగ్గి రూ. 2,35,000 వద్ద సేల్ అవుతోంది.