
Asian Games 2026: మహిళల టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఎదురైన ఘోర పరాభవాన్ని పక్కన పెట్టి, సరికొత్త టోర్నమెంట్లో కమ్‌బ్యాక్ ఇవ్వడానికి భారత మహిళల జట్టు సిద్ధమైంది. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా రాబోయే సెప్టెంబర్‌లో జరగనున్న ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ 2026 కోసం ఉమెన్స్ సెలెక్షన్ కమిటీ టీమిండియా స్క్వాడ్‌ను ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా భారత్ బరిలోకి దిగుతుండటం విశేషం.
కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్:
ఈ మెగా ఈవెంట్‌లోనూ భారత జట్టును స్టార్ క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన కెప్టెన్సీతో లీడ్ చేయనుండగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనుంది. బ్యాటింగ్ విభాగంలో విధ్వంసకర ఓపెనర్ షఫాలీ వర్మ, క్లాస్ ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలతో పాటు మెయిన్ వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్‌లు జట్టుకు భారీ బలాన్ని చేకూరుస్తున్నారు. అదనపు వికెట్ కీపింగ్ ఆప్షన్‌గా యంగ్ టాలెంట్ జి. కమలినికి సెలెక్టర్ల నుంచి పిలుపు అందింది.
శ్రేయాంక ఎంపికపై కండిషన్స్:
ఇక ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ లైన్-అప్‌ను కుప్పకూల్చే బాధ్యతను పేస్ సెన్సేషన్ రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డిలు తమ భుజాలపై వేసుకోనున్నారు. స్పిన్ విభాగంలో వేరియేషన్స్ కోసం రాధా యాదవ్, భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, నందిని శర్మలని ఎంపిక చేశారు. కానీ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, ఆమె తుది ఎంపిక పూర్తిగా ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పైనే ఆధారపడి ఉంటుందని బోర్డు చెప్పుకొచ్చింది.
ఏషియన్ గేమ్స్ కి భారత మహిళల స్క్వాడ్:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జి. కమలిని (వికెట్ కీపర్), భారతి ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్ (ఫిట్ నెస్ ఆధారంగా ఎంపిక)*, రాధా యాదవ్, నందిని శర్మ.
🚨 News 🚨
India Women’s squad announced for the 2026 #AsianGames in September.
More Details ▶️ https://t.co/JagEsizajH#TeamIndia pic.twitter.com/jJGddVSr17
— BCCI Women (@BCCIWomen) June 30, 2026