Reading Time: < 1 minute
Ramayana Trailer Launch In Los Angeles

టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ మూవీ వారణాసిని గ్లోబల్ లెవల్లో తీసుకెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నాడు రాజమౌళి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సినిమా గ్లింప్స్ చూపిస్తూ.. ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజయ్యే వెయ్యికోట్ల బడ్జెట్ సినిమా కోసం ఇప్పటి నుండే ప్రమోషన్స్ భుజానకెత్తుకుని, ఇన్వెస్టర్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ 4వేల కోట్లతో తెరకెక్కుతోన్న హై ఆక్డేన్ ఫిల్మ్ రామాయణ ప్రమోషన్స్ హడావుడి ఎక్కడా కనిపించడం లేదు.

నితేష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ మూవీ దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు ఏడాది క్రితమే ఎనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు ఒక గ్లింప్స్, రాముని ఇంట్రడక్షన్ తప్ప మరోక వీడియో రివీల్ చేయలేదు. సినిమా విడుదలకు పట్టుమని ఆరు నెలలైనా లేదు.. ప్రమోషన్స్‌లో టీం యాక్టివ్‌గా లేదు. దీంతో రామాయణ అనుకున్న డేట్‌కే వస్తుందా అని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట. రణబీర్, సాయి పల్లవి, యశ్ కీలక పాత్రల్లో నటించిన రామాయణ ట్రైలర్ లాస్ ఏంజెల్స్‌లో విడుదల చేయబోతున్నారని లేటెస్ట్ బాలీవుడ్ బజ్. జులై 14న భారీ ఈవెంట్ నిర్వహించి ఇంటర్నేషనల్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారని టాక్. అప్పుడే అఫీషియల్ రిలీజ్ డేట్ లాక్ చేయబోతున్నారని తెలుస్తోంది. విజువల్ వండర్‌గా తెరకెక్కించబోతున్న రామాయణ గ్లింప్స్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయలేకపోయాయి. ట్రైలర్ ఏమైనా వావ్ అనిపిస్తుందో లేదో చూడాలి.