Reading Time: < 1 minute

జై భీమ్ కాంబో రిపీట్.. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్ లో సూర్య మూవీ షురూ..

Caption of Image.

వరుస  ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య  తాజాగా 48వ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. తనకు ‘జై భీమ్‌‌’తో మంచి హిట్ ఇచ్చిన టీజే  జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకుడు.  ప్రముఖ కన్నడ  నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.  కయాదు లోహర్ హీరోయిన్‌‌. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో  ఈ చిత్రాన్ని ప్రారంభించారు.  మూవీ టీమ్‌‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని  శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా నిర్మాత  విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ ‘అభిరుచి, అంకితభావం కలిగిన వ్యక్తులు ఒకే లక్ష్యంతో కలిసి పనిచేసినప్పుడే గొప్ప సినిమాలు పుడతాయని మేము  నమ్ముతాం. సూర్య గారు, టి.జే. జ్ఞానవేల్ గారితో కలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే నిజాయితీగల, అర్థవంతమైన కథను చెప్పబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని అన్నారు. 

ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఎస్.ఆర్. కదిర్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. కె. కదిర్ ప్రొడక్షన్ డిజైనర్‌‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌‌గా పనిచేస్తున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.