
సైఫాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19 వేల కానిస్టేబుల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ నాయకులు సోమవారం లక్డీకాపూల్‌లోని రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. డీజీపీ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని బలవంతంగా అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఆస్మా, వెంకటేశ్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పిందని ఆరోపించారు. రాష్ట్రంలో 19 వేల కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కేవలం 5 వేల పోస్టుల భర్తీకే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను మోసం చేయడమేనని విమర్శించారు.