Reading Time: 2 minutes

ఎనర్జీ ఫుడ్ : ఈ పప్పులు పోషకాల గనులు.. ఏ పప్పులో ఎంత ప్రొటీన్లు ఉంటాయంటే.. !

Caption of Image.

వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాలను  ఎదుర్కోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా డైట్లో పప్పులు యాడ్ చేసుకోవాలి’ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు  పప్పులు తిననివాళ్లు కూడా వర్షాకాలంలో తినాల్సిందే.  చాలామందికి అసలు పప్పుల్లో ఏముంటాయో, ఎందుకు తినాలో కూడా తెలియదు. ఇంతకీ ఏ పప్పులు తింటే లాభం  కలుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

చాలా సందర్భాల్లో మన ఆహారపు అలవాట్లే, మనం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అందుకే హెల్దీ ఫుడ్ తినడం హ్యాబిట్స్ గా మార్చుకోవాలి. అలా అనుకునేవాళ్లు వాళ్ల డైట్ లో ముందుగా చేర్చుకోవాల్సినవి పప్పులు, మామూలుగానే మన దేశంలో పప్పులు ఎక్కువగా తింటారు. మన దగ్గర దాదాపుగా ప్రతి ఇంట్లో పప్పులు స్టాక్ ఉంటాయి. కొందరు మాత్రం ఇంట్లో పప్పు వండామని చెప్తేనే ‘అబ్బా.. పప్పా  అని ముఖం బిట్లిస్తారు. కానీ, అందరూ తప్పకుండా పప్పులు తినాలి. దానివల్ల శరీరానికి న్యూట్రియంట్స్ అంది హెల్దీగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కందిపప్పు:  ఇందులో  అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా కావాల్సినంత ప్రొటీన్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా కొలెస్ట్రాల్, శాచ్యురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటాయి. ఫైబర్ లోని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఈ పప్పుతో అన్నం తింటే చాలాసేపటి వరకు నీరసం రాదు. దీనిలో  గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా తినొచ్చు. విటమిన్- బి. పాస్ఫరస్, మెగ్నిషియం, పొటాషియం కూడా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు పెరుగుతుంది. 

గర్భిణుల్లో పిండం ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. కందిపప్పు తినడం వల్ల గుండె వ్యాధులు కూడా దరిచేరవు. టైప్2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కందిపప్పుతో ముద్దపప్పు, పచ్చడి పొడి చేసుకోవచ్చు. వంద గ్రాముల కందిపప్పులో 21.7 గ్రాముల ప్రొటీన్, 1.5 గ్రాముల ఫైబర్ ఉంటాయి.

మినప్పప్పు:  చిన్న పిల్లలు తినే ఉగ్గు నుంచి మనం ప్రతి రోజూ చేసే బ్రేక్​ ఫాస్ట్​  వరకు అనేక వంటకాల్లో మినప్పప్పు వాడుతుంటాం. ఇడ్లీలు, దోశెలు ఏది చేయాలన్నా మినప్పప్పు కావాలి . ఇందులో గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల ఆక్సిజన్ శరీరానికంతటికీ అందుతుంది. దాంతో రోజంతా చురుకుగా ఉంటారు. మినప్పప్పు వెన్నెముకకు బలాన్నిస్తుంది. ఎముకల బలానికి చాలా ఉపయోగపడుతుంది. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆకలిని పుట్టిస్తుంది.

పెసర పప్పు : పెసల్లో కూడా ప్రొటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ బరువు తగ్గిస్తుంది. ఈ పప్పు ఆకలి తగ్గిస్తుంది. పెసరపప్పును చాలా రకాలుగా వండుకోవచ్చు, ఉదయం పెసరట్టుతో బ్రేక్ ఫాస్ట్ చేయొచ్చు. మధ్యాహ్నం పప్పుచారు చేసుకోవచ్చు. సాయంత్రం పెసలతో కిచిడి చేసుకుని తినొచ్చు. ప్రతి రోజు గుప్పెడు మొలకెత్తిన పెసలు తింటే ఆరోగ్యంగా ఉండొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. 

ఇవే కాదు పెసర పునుగులు, పెసరపప్పు హల్వా, బర్ఫీ చేసుకోవచ్చు.  ఇవి తింటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రెగ్యులర్ గా తింటే ఐరన్ పెరుగుతుంది. పెసల్లో విటమిన్- బి, విటమిన్- సి, మాంగనీసు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. వంద గ్రాముల పెసల్లో 24 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి.

శెనగపప్పు :  సన్​ లైట్​, పొల్యూషన్ వల్ల శరీరంపై బ్యాన్ పెరిగిపోతుంది ఇలాంటివాళ్లు శెనగపప్పు తింటే డీట్శాస్ అవుతుంది. శెనగపప్పును రోజూ ఏదోఒక రూపంలో తింటుంటాం. కూరలకు పెట్టే పోపులో, చట్నీలో. రోటి పచ్చళ్లల్లో  శెనగపప్పు వేస్తాం. అప్పుడప్పుడు శనగపప్పుతో కూరలు వండుకుని తినాలి. దీనివల్ల ఆకలి అదుపులో ఉంటుంది.. శెనగ పప్పులో ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. శెనగల్లో ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్​ఉంటుంది. కాబట్టి మాంసం తినని వాస్తు కచ్చితంగా తినాలి. బరువును తగ్గించడంలో కూడా సాయపడుతుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. జీర్ణాశయ క్యాన్సర్, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలను కూడా రాకుండా చేస్తుంది. కొన్నిరకాల క్యాన్సర్లను రాకుండా కాపాడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది..

ఎర్ర కందిపప్పు : దీన్ని మసూర్ దాల్ అని కూడా పిలుస్తుంటారు. కందిపప్పులో ఉన్నట్టే అందులో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ పప్పు తిన్నాక చాలా సేపటివరకు పొట్ట నిండుగా ఉంటుంది. ఇంకేమీ తినాలనిపించదు. ఇందులో ఉండే ప్రొటీన్, ఎసెన్సియల్ ఎమైనో ఆసిడ్స్, విటమిన్- బి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. ఒక కప్పు ఎర్ర కందిపప్పులో 230 క్యాలరీలు, 16 గ్రాముల డైటరీ ఫైబర్, 18 గ్రాముల ప్రొటీన్స్, 6.6 గ్రాముల ఐరన్, 40 గ్రాముల కార్బోహైడ్రేట్స్ 0.8 గ్రాముల ఫ్యాబ్ ఉంటాయి..

 

©️ VIL Media Pvt Ltd.