Reading Time: < 1 minute

ఏపీ సచివాలయంలో అరుదైన సీన్…ఒకేరోజు 16మంది అధికారులు, ఉద్యోగులు రిటైర్మెంట్…

Caption of Image.

ఏపీ సచివాలయంలో అరుదైన సీన్ చోటు చేసుకుంది. ఒకేరోజు వివిధ శాఖలకు చెందిన 16 మంది సీనియర్ అధికారులు, ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారు. మంగళవారం ( జూన్ 30 ) చోటు చేసుకుంది ఈ  అరుదైన ఘటన. ఒకేరోజున ఇంతమంది అధికారులు, ఉద్యోగులు పదవీ విరమణ పొందటం అరుదుగా జరిగే సందర్భం అని చెప్పాలి.

2025 రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో భాగంగా జూన్ 25 నుంచి బదిలీలు, ప్రమోషన్లపై ఫీజింగ్ విధించాలని భావించింది ఏపీ సర్కార్. అయితే.. ఇవాళ అధికారులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో రిటైర్ అవుతున్న క్రమంలో ఏర్పడే ఖాళీల ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసేందుకు వీలుగా గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు ఉద్యోగ సంఘాల నేతలు.

ఉద్యోగ సంఘాల డిమాండ్ కు సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం. ఫ్రీజింగ్ గడువును జులై 5 వరకు పెంచింది. దీంతో ఇవాళ రిటైర్ అయినా 16 మంది అధికారుల స్థానంలో అర్హులైన సిబ్బందికి తక్షణమే ప్రమోషన్లు ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది.

©️ VIL Media Pvt Ltd.