Reading Time: 2 minutes

హీరోయిన్ని వేధించిన కేసు: జైలు పాలయ్యాక సారీ చెప్పిన వ్యాపారవేత్త.. హనీ రోజ్‌ రియాక్షన్పై ఆసక్తి!

Caption of Image.

గతేడాది మలయాళ స్టార్ హీరోయిన్ హనీరోజ్‌పై ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హనీరోజ్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం.. బాబీ జైలు పాలవ్వడం ఇలా అన్నీ జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే తప్పును గ్రహించిన వ్యాపారవేత్త బాబీ చెమ్మన్నూర్ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. తన వల్ల హనీరోజ్‌ మనోభావాలు దెబ్బతిన్నాయని గుర్తించిన చెమ్మన్నూర్, తనపై నమోదైన క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలని కోరారు.

సోమవారం (June 29) ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టులో బాబీ చెమ్మన్నూర్ మాట్లాడుతూ..‘‘తాను ఎప్పుడూ అందరితో గౌరవంగా, మర్యాదగా వ్యవహరించానని, కావాలని ఎవరినీ బాధపెట్టలేదని చెప్పారు. సోషల్ మీడియాలో సరదా, హాస్యభరితమైన పోస్టులు పంచుకునేవాడినే గానీ, ఎవరినైనా అవమానించడం లేదా బాధపెట్టడం’’ తన ఉద్దేశం కాదన్నారు.

అయితే, హనీ రోజ్ గురించి తాను చేసిన వ్యాఖ్యలు ‘ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా తీవ్రంగా బాధించాయని ఇప్పుడు అర్థమైందని తెలిపారు. “నా మాటల వల్ల కలిగిన బాధకు హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను. నా వ్యాఖ్యలకు, వాటి ప్రభావానికి పూర్తి బాధ్యత వహిస్తున్నాను’అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాను ఎప్పుడూ ఆమెను బాధపెట్టాలనే ఉద్దేశంతో వ్యవహరించలేదని చెబుతూ, తన నిజాయితీతో కూడిన క్షమాపణను స్వీకరించి కేసును ఉపసంహరించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగిసిన అంశంగా భావించి, ముందుకు సాగాలని కోరుకుంటున్నానని బాబీ చెమ్మన్నూర్ వెల్లడించారు.

ఈ క్రమంలోనే తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడాన్ని నటి హనీ రోజ్ సైతం అంగీరించినట్లు సమాచారం. ‘‘అది మంచి నిర్ణయం. మొదట్లోనే క్షమాపణ చెప్పి ఉంటే ఈ వివాదం ఇంత దూరం వెళ్లేది కాదు” అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలా లేదా అన్న విషయంపై కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు’’ మలయాళ సినీ వర్గాలు పేర్కొన్నాయి. 

వివాదం ఎక్కడ మొదలైంది:

గతంలో బాబీ కి సంబందించిన జ్యువెలరీ దుకాణ ప్రారంభిత్సవంలో హానీ రోజ్ పాల్గొంది. దీంతో వీరిద్దరిమధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత బాబీ ప్రవర్తనలో మార్పులు రావటం గమనించిన హానీ రోజ్ కొంతకాలంగా అతడిని దూరం పెట్టింది. ఇక బాబీ కి సంబందించిన దుకాణాల ప్రారంభిత్సవంలో కూడా పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే బాబీ నటి హానీ రోజ్ ని ఉద్దేశించి సోషల్ మీడియా, ఇంటర్వ్యూ వీడియోస్ లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బంది పెట్టాడు. కానీ హనీరోజ్ మాత్రం మరోమారు సోషల్ మీడియా లేదా ఇతర ఇంటర్వూలలో తన పేరుని ఉపయగించి మాట్లాడవద్దని తన మేనేజర్ ద్వారా చెప్పినప్పటికీ బాబీ మాత్రం వినలే. దీంతో హనీరోజ్ ఎర్నాకులం పోలీసులకి ఫిర్యాదు చేసింది.

►ALSO READ | సన్నీ డియోల్ Vs అక్షయ్ ఖన్నా.. మైండ్ బ్లోయింగ్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘ఇక్కా’ ట్రైలర్ రిలీజ్!

బాబీ చెమ్మన్నూర్ తనపై అసభ్యకరమైన, లైంగిక సూచనలతో కూడిన వ్యాఖ్యలు చేశారని హనీ రోజ్ ఆరోపించింది. మహిళలను డబ్బు, ప్రభావంతో అవమానించే హక్కు ఎవరికీ లేదని ఆమె అప్పట్లో స్పష్టం చేసింది. హనీ రోజ్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన లైంగిక వేధింపుల కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) 2025 జనవరిలో బాబీ చెమ్మన్నూర్‌ను అరెస్ట్ చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Honey Rose (@honeyroseinsta)

ఆయనపై లైంగిక వేధింపులకు సంబంధించిన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 75(4)తో పాటు, ఎలక్ట్రానిక్ రూపంలో అసభ్యకర కంటెంట్ ప్రచారం చేసినందుకు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసులు నమోదు అయ్యాయి. తన ఫిర్యాదులో, వివిధ వేదికల ద్వారా బాబీ చెమ్మన్నూర్ పలుమార్లు తనపై లైంగిక సూచనలతో కూడిన వ్యాఖ్యలు చేశారని హనీ రోజ్ ఆరోపించారు. అంతేకాకుండా, సోషల్ మీడియా వేదికగా తనను వెంబడిస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. 

ఈ విషయం ఇలా ఉండగా.. హనీరోజ్ హీరో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించి తెలుగు ఆడియన్స్ని మెప్పించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో నటించలేదు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Honey Rose (@honeyroseinsta)

©️ VIL Media Pvt Ltd.