Reading Time: < 1 minute

ఏడుపాయలలో 12 కాటేజీల నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు

Caption of Image.

మెదక్, పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.7 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 12 కాటేజీలు నిర్మించేందుకు టూరిజం స్పెషల్ సెక్రటరీ వాణి ప్రసాద్​సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు మెదక్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌‌‌‌‌‌‌‌రావు ప్రకటనలో తెలిపారు.

ఈ కాటేజీలను ఆధునిక హంగులతో పర్యావరణ హితంగా నిర్మించనున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్​ రెడ్డి ఏడుపాయలకు వచ్చి వనదుర్గామాతను దర్శించుకుని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం గతంలో రోడ్డు అభివృద్ధికి రూ.35 కోట్లు మంజూరు చేయగా, తాజాగా రూ.7 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.