
చైనాలో విమాన ప్రమాదం జరిగింది. చైనా రాజధాని బీజింగ్ లో అత్యంత ఎత్తయిన 109 అంతస్తుల టవర్ ను ఓ ప్రైవేట్ విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చైనాలోనే మూడో అతిపెద్ద భవనం అయిన సిటిక్ టవర్ లోని ఓ అంతస్తులోసన్‌వార్డ్ SA 60L అరోరా లైట్ స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో భవనం స్వల్పంగా డ్యామేజ్ అయింది. శుక్రవారం(జూన్26) జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు చైనా ఎటువంటి ప్రకటన చేయలేదు.
ప్రపంచంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నగరాల్లో ఒకటైన చైనా రాజధాని బీజింగ్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఓ చిన్న విమానం 109 అంతస్తుల సిటిక్ టవర్‌ను ఢీకొట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం తర్వాత విమాన శిథిలాలు కింద పడటం, విమానం తోక భాగం నేలపై కనిపించడం, సమీపంలో ఉన్న టాక్సీ కిటికీలు పగిలిపోవడం వీడియోల్లో కనిపిస్తోంది. భవనంలోని ఒక అంతస్తులో కూడా కిటికీలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
►ALSO READ | వెనుజులా విషాదం తర్వాత మరోసారి ప్రకృతి హెచ్చరిక.. ఫిలిప్పీన్స్లో 6.5 తీవ్రతతో భూకంపం
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనపై చైనా అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అంతర్జాతీయ మీడియా ప్రకారం ప్రమాదానికి గురైన విమానం దేశీయంగా తయారైన సన్‌వార్డ్ SA60L అరోరా లైట్ స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ అయి ఉండొచ్చని తెలుస్తోంది. ప్రమాదానికి గల అసలు కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
A small plane crashes into a 109-story skyscraper in Beijing, sending debris down the building’s side.
Local reports say the pilot Liu Junhua was conducting a solo flight in the local airspace, took off from Shifosi Airport at 17:30, and at 17:40 prepared to return for landing.… pic.twitter.com/drmOgMvQ9E
— Breaking Aviation News & Videos (@aviationbrk) June 26, 2026