
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియో గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా జూన్ 1వ తేదీన ( నేడు) విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు ‘పెద్ది’ టీమ్. ఈ వేడుకకు ‘పెద్ది’ చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.. అభిమానులు ఇప్పటికే స్టేడియం బయట భారీగా చేరుకున్నారు..
బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.