Reading Time: 3 minutes
Ram Charan Peddi Movie Special Song Promo Released Bhopal Launch

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా నుండి మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ ‘ఊరమాస్ ట్రీట్’ వచ్చేసింది.. ఈ చిత్రంలోని హై-వోల్టేజ్ స్పెషల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ ఈరోజు అధికారికంగా విడుదల చేశారు.

ప్రోమో కట్ చూస్తుంటే థియేటర్లలో మాస్ ఆడియన్స్‌కు పూనకాలు రావడం ఖాయం అనిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ఈ స్పెషల్ మాస్ సాంగ్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) మార్క్ ఎనర్జిటిక్ బీట్స్, రామ్ చరణ్ ఊరమాస్ గ్రేస్ ఈ ప్రోమోకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్, ఈ చిత్ర కథానాయిక జాన్వీ కపూర్ కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ముగ్గురు స్టార్స్ కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఊరమాస్ స్టెప్పులతో డ్యాన్స్ ఫ్లోర్‌పై అరాచకం సృష్టించారు.

కాగా మే 23న (రేపు) మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించబోయే ఒక గ్రాండ్ లైవ్ ఈవెంట్‌లో ఈ ఫుల్ సాంగ్‌ను అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఈవెంట్‌లో ఏఆర్ రెహమాన్ స్వయంగా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. కేవలం ప్రోమోతోనే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన ఈ సాంగ్.. రేపు ఫుల్ లిరికల్/వీడియో బయటకు వచ్చాక ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.