Reading Time: < 1 minute
Aiadmk Action Against Mlas Supporting Vijay Floor Test

AIADMK: తమిళనాడులో రాజకీయ ట్విస్టులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, సీఎం విజయ్‌కు మద్దతు ప్రకటించిన నేతలపై అన్నాడీఎంకే యాక్షన్ మొదలుపెట్టింది. పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన నేతలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామిని ధిక్కరించి, సుమారు 25 మంది ఎమ్మెల్యేలు బలపరీక్షల్లో విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు.

Read Also: Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..

ఈ నేపథ్యంలో సీవీ షణ్ముగంఎస్పీ వెలుమణి, సీ విజయభాస్కర్ తదితరులను పార్టీ పదవుల నుంచి తొలగించినట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. పార్టీ విప్ ధిక్కరించిన నేతలపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఈ విషయంపై ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.

బుధవారం ఉదయం తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బల నిరూపణ పరీక్షలో విజయ్ ప్రభుత్వం మెజారిటీ సాధించింది. 234 సభ్యులు ఉన్న అసెంబ్లీలో విజయ్‌కు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. 22 మంది వ్యతిరేకంగా ఓటేశారు. డీఎంకే పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.