Reading Time: 2 minutes
టాలీవుడ్‌లో తిరుగులేని నటుడు.. ఆయన భార్య కూడా చాలా ఫేమస్.. ఎవరో గుర్తుపట్టారా.?

సోషల్ మీడియాలో సినిమా సినీ సెలబ్రెటీల ఫోటోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు నిత్యం వదల ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు సినీ తార సినిమా విశేషాలతో పాటు.. వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు.. ఇక ఇప్పుడు ఓ సినీ కపుల్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో ఉన్న స్టార్ కపుల్ ఎవరో గుర్తుపట్టారా.? ఈ ఇద్దరూ ఇండస్ట్రీని ఏలారు.. ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. ఇంతకూ ఆ జంట ఎవరో గుర్తుపట్టారా.? ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

ఇది కూడా చదవండి : Banerjee: ఎవరైనా ఆ హీరో బయోపిక్ తీయాలి.. ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కున్నాడు..

ఫొటోలో ఉన్న జంట ఎవరో కాదు తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న నటుడు శ్రీహరి. విలన్ గా కెరీర్ మొదలు ఆతర్వాత హీరోగా మెప్పించారు. అలాగే సహాయక పాత్రల్లో అద్భుతంగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా రాణించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీహరి ఆ తర్వాత ఇతర హీరోల సినిమాల్లోనూ నటించారు. మగధీర, ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం తదితర సూపర్ హిట్ సినిమాల్లో శ్రీహరి పోషించిన పాత్రలకు మంచి పేరొచ్చింది.

ఇది కూడా చదవండి :లేటుగా వచ్చాడని ఆ స్టార్ హీరోని రోజంతా ఎండలో నిలబెట్టారు.. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో పెద్ద స్టార్

ఆయన స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన డిస్కో శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. శ్రీహరి కొడుకు హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. శ్రీహరి హీరోగా చేసిన మొదటి చిత్రం ‘పోలీస్’ అయితే.. హీరోగా చేసిన చివరి చిత్రం ‘పోలీస్ గేమ్’ కావడం విశేషం. అనారోగ్య సమస్యలతో అక్టోబరు 9, 2013 న ముంబై లో శ్రీహరి కన్నుమూసారు. తాజాగా శ్రీహరి డిస్కో శాంతి పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది కూడా చదవండి : వార్ని..! విజయ్‌తో ఉన్న ఈ చిన్నారి.. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో బ్లాక్ బస్టర్స్ అందుకుంది

Srihari

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.