
వేసవిలో అధిక వేడికి వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ కాలంలో శరీరంలో నీటి శాతాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది శరీరంలో నీటి శాతాన్ని కాపాడుకోవడానికి, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఫ్రిజ్‌లో ఉంచిన నీళ్లను ఎక్కువగా తాగుతుంటారు. ఇది అప్పటికి ఆహ్లాదకరంగా ఉన్నా.. వేసవిలో ప్రతిరోజూ ఇలా ఫ్రిజ్‌లో ఉంచిన చల్లటి నీటిని తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్‌లో ఉంచిన నీటిని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో నిపుణుల మాటల్లో మీకోసం..
వేసవిలో శీతలీకరించిన నీటిని తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే?
జీర్ణవ్యవస్థపై ప్రభావం
బయటి వేడి వాతావరణం నుంచి ఇంటి లోపలికి వచ్చినప్పుడు శరీరం అప్పటికే అధిక ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో చల్లటి నీరు తాగడం శరీరాన్ని షాక్‌కు గురి చేస్తుంది. ఇది శరీర సహజ ప్రక్రియలను ప్రభావితం చేస్తుంది. జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. బయటి నుండి వచ్చే చల్లదనాన్ని సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి శరీరం అదనంగా కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాకుండా గొంతు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.
హృదయ స్పందన రేటులో మార్పు
వేసవిలో రిఫ్రిజిరేటర్‌లోని నీటిని అధికంగా తాగడం వల్ల హృదయ స్పందన రేటు తగ్గుతుంది. చల్లటి నీరు నేరుగా వేగస్ నాడిపై ప్రభావం చూపి, మీ హృదయ స్పందన రేటును నెమ్మదింపజేస్తుంది.
తలనొప్పి
ఎండలో లేదా తీవ్రమైన వేడిలో ఉండి నేరుగా చల్లటి లేదా ఐస్ నీటిని తాగితే తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. చల్లటి నీరు తాగడం వల్ల వెన్నెముకలోని అనేక నరాలు చల్లబడతాయి. ఇది మెదడుపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల తలనొప్పి రావచ్చు.
జలుబు – దగ్గు
మీ శరీర ఉష్ణోగ్రత బయటి ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉన్నప్పుడు రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీటిని తాగితే మీ శరీరం ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల జలుబు, జ్వరం రావచ్చు. అందువల్ల రిఫ్రిజిరేటర్‌లోని నీటిని తాగడం మీ ఆరోగ్యానికి హానికరం.
బరువు పెరుగుతారు
వేసవిలో ఎక్కువగా ఫ్రిజ్ నీళ్లు తాగితే త్వరగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులకే ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన నీటిని తాగడం మానుకోవాలి. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు గడ్డకట్టి, బరువు తగ్గడానికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఫ్రిజ్ నీళ్లను తాగకపోవడమే మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.