July 15, 2026

Janhvi Kapoor: జాన్వీ పెళ్లి వార్తలపై బోనీ కపూర్ సీరియస్..

Janhvi Kapoor: జాన్వీ పెళ్లి వార్తలపై బోనీ కపూర్ సీరియస్..
Reading Time: < 1 minute
Janhvi Kapoor Marriage Clarification Boney Kapoor Peddi Movie Update

బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్, ఆమె ప్రియుడు శిఖర్ పహారియాల పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీరు తిరుపతిలోనో లేదా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోనో రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఈ పుకార్లన్నింటికీ తాజాగా ఆమె తండ్రి, నిర్మాత బోనీ కపూర్ ఫుల్ స్టాప్ పెట్టారు.

‘అందులో అస్సలు నిజం లేదు’ అని ఆయన కుండబద్దలు కొట్టారు.. ‘ప్రస్తుతం జాన్వీ తన కెరీర్ మీద చాలా సీరియస్‌గా ఉంది, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన ఆమెకు లేదు’ అని బోనీ కపూర్ స్పష్టం చేశారు. నిజానికి జాన్వీ-శిఖర్ మధ్య ప్రేమ వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తోంది. ఒక ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ, శిఖర్ తన పక్కన ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుందని, కష్టాల్లో అతను తనకు అండగా నిలుస్తున్నాడని ఎమోషనల్ కూడా అయ్యింది. కపూర్ ఫ్యామిలీలో ఏ చిన్న పండగ జరిగినా శిఖర్ అక్కడ వాలిపోతుంటారు. కానీ బోనీ కపూర్ చెప్పనట్లుగానే.. ప్రస్తుతానికి జాన్వీ దృష్టి అంతా తన సినిమాలపైనే ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. అందుకే వ్యక్తిగత జీవితం కంటే వృత్తిపరమైన విజయాలకే ఆమె ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తోంది.