Reading Time: < 1 minute
వివాదంలో త్రిష..అసలు తప్పెవరిది..?

సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన కరుపు సినిమా ఆడియో లాంచ్ ఇటీవల జరిగింది. అయితే, ఈ వేడుకకు హీరోయిన్ త్రిష హాజరుకాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సినిమా చేస్తారు కానీ ప్రమోషన్లకు రాలేదని ఆమెపై మొదట విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, ఈ వివాదం వెనుక ఓ ఊహించని ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. కరుపు ఆడియో వేడుకకు త్రిష రాకపోవడానికి ప్రధాన కారణం చిత్ర బృందం నుంచి ఆమెకు ఆహ్వానం అందకపోవడమే అని సమాచారం. ఈ విషయాన్ని త్రిష తనదైన శైలిలో పరోక్షంగా, సెటైరికల్‌గా స్పష్టం చేశారు. ఓ నెటిజన్ “ఈ సినిమాలో మీరు ఉన్నారా?” అని అడగగా, “నేను మర్చిపోయాను, బహుశా నా ఆహ్వానం మెయిల్‌లో మిస్ అయి ఉండవచ్చు” అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు.

మరిన్ని వీడియోల కోసం :

వైరల్ అవుతున్న సారా అర్జున్‌ లేటెస్ట్ ఫోటో షూట్

టాలీవుడ్‌ లో మళ్లీ మొదలైన థియేటర్ల వివాదం

ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా దేవర సీక్వెల్

ముంచేస్తున్న ఫ్లాప్స్.. రావట్లేదు ఆఫర్స్