
తమిళనాడు రాజకీయాల్లో ఒక నూతన శకం ఆరంభమైంది. దశాబ్దాల కాలంగా ద్రవిడ దిగ్గజాల నీడలో సాగిన రాష్ట్ర రాజకీయాలు, ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరిగాయి. శాసనసభ ఎన్నికల ఫలితాలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ 108 స్థానాలను కైవసం చేసుకుని, అతిపెద్ద పార్టీగా అవతరించి చరిత్ర సృష్టించింది. సినిమా గ్లామర్‌ను ప్రజాబలంగా మార్చుకోవడంలో విజయ్ అద్భుత విజయాన్ని సాధించారు. అయితే, ఈ గెలుపు కంటే ఆయన ప్రదర్శిస్తున్న వినయం, పరిణతి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విజయం లభించిన వెంటనే ఆయన అహంకారానికి తావు లేకుండా, బాధ్యతాయుతమైన నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
విజయ్ ఘన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ స్పందిస్తూ, తన రాజకీయ పంథా కేవలం ప్రతిపక్షం కోసం కాదని, అది అభివృద్ధి, వారసత్వం కోసం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అభినందనలకు విజయ్ స్పందిస్తూ, రాష్ట్ర పురోగతి కోసం కేంద్ర ప్రభుత్వ మద్దతు కావాలన్నారు. “మా ప్రజల సంక్షేమమే ఏకైక లక్ష్యం. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం,” అని విజయ్ తన వినయశీలతను చాటుకున్నారు.
After his party emerged as the single largest party in Tamil Nadu polls, TVK chief Vijay tweets, “Thank you, Hon’ble PM Modi for your greetings. The well-being of our people remains our only goal. Transcending politics, we shall focus on the State’s progress and the welfare of… pic.twitter.com/nXkh4Foq8d
— ANI (@ANI) May 5, 2026
అంతకు ముందు ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియా X బ్లాగ్‌లో ఇలా రాశారు, “తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన తమిళనాడు ఓటర్లకు ధన్యవాదాలు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మేము ఎల్లప్పుడూ ముందుంటాము. అద్భుతమైన పనితీరు కనబరిచిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీకి, విజయ్‌కు అభినందనలు. తమిళనాడు పురోగతికి, దాని ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది.” అనే ప్రధాని మోదీ పేర్కొన్నారు.
தமிழ்நாடு சட்டமன்றத் தேர்தலில் தேசிய ஜனநாயகக் கூட்டணியை ஆதரித்த தமிழக வாக்காளர்களுக்கு எங்களது நன்றி. மக்களின் பிரச்சனைகளுக்குத் தீர்வு காண்பதிலும், அவர்களின் வாழ்க்கைத்தரத்தை மேம்படுத்துவதிலும் நாங்கள் எப்போதும் முன்னணியில் இருப்போம்.
தமிழக வெற்றிக் கழகத்தின் சிறப்பான…
— Narendra Modi (@narendramodi) May 4, 2026
విజయ్ విజయంతో తమిళనాడులో మార్పు మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు. భావోద్వేగపూరిత రాజకీయాల కంటే, అభివృద్ధి, సంక్షేమం చుట్టూ తన రాజకీయాలను మలచుకుంటానని విజయ్ ప్రకటించడం గమనార్హం. ఒక నటుడిగా కోట్లాది మంది అభిమానాన్ని పొందిన ఆయన, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ప్రజాక్షేత్రంలో ఏ విధంగా రాణిస్తారో చూడాలని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గెలుపు కేవలం ఒక పార్టీ విజయం మాత్రమే కాదు, తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త ఆశకు నాంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..