
కేరళలో ఏనుగు కారుపై దాడి చేసి ధ్వంసం చేసింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం క్షణాల్లో భీతావహంగా మారింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న తెల్లటి కారుపై ఆగ్రహించిన ఓ ఏనుగు దాడికి దిగింది. తన బలమైన తొండం, దంతాలతో కారును ప్లాస్టిక్ బొమ్మలా గాలిలోకి విసిరేసి, పూర్తిగా నుజ్జునుజ్జు చేసింది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. అదృష్టవశాత్తు, దాడి జరిగిన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవేళ ప్రయాణికులు ఉండి ఉంటే పరిస్థితి మరింత భయంకరంగా ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, నెటిజన్లు ఏనుగు ఆగ్రహాన్ని చూసి షాక్ అవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :