Reading Time: 2 minutes

మీ కారుకి ఫాస్టాగ్ అతికించలేదా ? NHAI కొత్త రూల్స్.. వెంటనే ఈ పని చేయండి!

Caption of Image.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ వినియోగదారుల కోసం కొన్ని కీలక హెచ్చరికలు జారీ చేసింది. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ తగ్గించడానికి, మోసాలను అరికట్టడానికి ఈ నిర్ణయాలు తీసుకుంది. ఫాస్టాగ్ అనేది భారతదేశంలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీని ఉపయోగించి టోల్ ఛార్జీలను ఆటోమేటిక్‌గా వసూల్ చేసే ఒక ఎలక్ట్రానిక్ టోల్ చార్జెస్ సిస్టం. జాతీయ రహదారి అథారిటీ (NHAI) మార్గదర్శకాల ప్రకారం, RFID రీడర్‌లు ఈజీగా స్కాన్ చేయడానికి వీలుగా ఫాస్టాగ్‌ను వాహనం విండ్‌స్క్రీన్‌పై అతికించాలి.  

1. ఫాస్టాగ్‌ను విండ్‌స్క్రీన్‌కే అతికించాలి
చాలామంది వాహనదారులు ఫాస్టాగ్‌ను అద్దానికి అతికించకుండా చేతిలో పట్టుకోవడం లేదా డాష్‌బోర్డ్‌పై ఉంచడం చేస్తుంటారు. దీనిపై NHAI కఠినంగా వ్యవహరించనుంది. 
* ఫాస్టాగ్‌ను కచ్చితంగా వాహనం ముందు అద్దం మధ్యలో మాత్రమే అతికించాలి.
*ఒకవేళ ఫాస్టాగ్‌ను  అద్దానికి అతికించకుండా చేతితో చూపిస్తే, ఆ ఫాస్టాగ్‌ను బ్లాక్ లిస్ట్ /రద్దు చేసే అవకాశం ఉంది.

ఫాస్టాగ్‌ను ఎందుకు అద్దానికి అతికించాలి: అద్దానికి ఉంటేనే టోల్ గేట్ వద్ద ఉండే స్కానర్లు ఈజీగా రీడ్ చేస్తాయి. దీనివల్ల ట్రాఫిక్ జామ్ అవ్వదు. అలాగే ఒకే ఫాస్టాగ్‌ను వేర్వేరు కార్లకు వాడకుండా లేదా మోసాలు జరగకుండా అడ్డుకోవచ్చు. 

2. నకిలీ వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్త
ఈ మధ్య కాలంలో ఫాస్టాగ్ పేరుతో మోసాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఫాస్టాగ్‌ యాన్యువల్ పాస్ ఇస్తామని నమ్మించే ఫేక్ వెబ్‌సైట్ల గురించి NHAI హెచ్చరించింది. మోసగాళ్లు అచ్చం ప్రభుత్వ వెబ్‌సైట్‌లలాగే కనిపించే నకిలీ లింక్‌లను సృష్టిస్తున్నారు. ఆ లింక్స్‌  నమ్మి క్లిక్ చేసి డబ్బులు కట్టిన తరువాత మీ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.

3. మీ ఫాస్టాగ్, డబ్బు సురక్షితంగా ఉండాలంటే ఈ సూచనలు పాటించండి:
* ఫాస్టాగ్ సేవలు లేదా రీఛార్జ్ కోసం ప్రభుత్వ అధికారిక యాప్ ‘రాజ్ మార్గ్ యాత్ర’ (Rajmargyatra) మాత్రమే వాడండి.
*గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు వచ్చే ‘Sponsored’ లేదా తెలియని లింక్‌లను నమ్మకండి.
*ఏదైనా వెబ్‌సైట్‌లో మీ వివరాలు ఎంటర్ చేసే ముందు ఆ వెబ్ సైట్  ఒరిజినల్ కాదో చెక్ చేయండి లేదా URL చెక్ చేయండి. 

ముఖ్యమైన విషయం ఏంటంటే మీ OTP, పిన్ నంబర్ లేదా ఎటిఎం కార్డ్ వివరాలను ఎవరికీ చెప్పకండి. ఫాస్టాగ్ అధికారులు మీ OTPని ఎప్పుడు అడగరని గుర్తుంచుకోండి. ఏదైనా వెబ్‌సైట్ అనుమానంగా అనిపించినా లేదా ఫోన్ పర్మిషన్లు అడిగినా వెంటనే ఆ సైట్ క్లోజ్ చేయండి. టోల్ ప్లాజాల వద్ద అనవసర జాప్యం, జరిమానాలను నివారించడానికి మీ ఫాస్టాగ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి.

 

©️ VIL Media Pvt Ltd.