
పశ్చిమ బెంగాల్‌తో పాటు అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ విజయం దేశ ఉజ్వల భవిష్యత్‌కు నాంది అని ప్రధాని మోడీ అన్నారు. మూడు రాష్ట్రాల్లో విజయం సందర్భంగా ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఈ ఘన విజయంతో బీజేపీ కార్యకర్తలు చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఈరోజు చారిత్రాత్మకమైనది.. అపూర్వమైనది.. కార్యకర్తల ఆనందంలో తాను కూడా పాలుపంచుకుంటున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యం, పనితీరు రాజకీయాలపై విశ్వాసం చూపించే రోజు అన్నారు. బెంగాల్‌లో బీజేపీ ఘన విజయంతో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించిందని మోడీ పేర్కొన్నారు.
నేటి నుంచి బెంగాల్‌లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. నేడు 20కి పైగా రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. ‘‘నాగరిక్ దేవో-భవ’’ మా మంత్రం. ప్రజలు మమ్మల్ని మరింత ఎక్కువగా విశ్వసిస్తున్నారు.’’ అని అన్నారు.