Reading Time: < 1 minute
మధ్యప్రదేశ్ లీగ్ వేలంలో శిఖర్ ధావన్, మహానార్యమాన్ సందడి.. క్రికెట్ ఆడుతూ..!

క్రికెట్ అంటే మన భారతీయులకు ఒక ఎమోషన్. ఆటగాళ్లు మైదానంలో చేసే విన్యాసాలను చూడటానికి మనం ఎంతగానో ఇష్టపడతాం. ఇటీవల గ్వాలియర్‌లో జరిగినమధ్యప్రదేశ్ లీగ్ (MPL) మహిళల ఎడిషన్ ప్లేయర్ల వేలం కార్యక్రమం క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది. టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్, గ్వాలియర్ రాజకుమారుడు మహానార్యమాన్ సింధియాతో కలిసి క్రికెట్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. మైదానంలో శిఖర్ ధావన్ బ్యాటింగ్ చేస్తుండగా, మహానార్యమాన్ సింధియా బౌలింగ్ వేయడం ఒక అరుదైన దృశ్యం. శిఖర్ ధావన్ తన క్లాసిక్ స్టైల్‌లో బంతిని అడ్డుకుని ఫ్యాన్స్‌ని ఖుషి చేశారు. రాజకుటుంబానికి చెందిన మహానార్యమాన్ క్రీడల పట్ల చూపిస్తున్న ఆసక్తి అంతా ఇంతా కాదు. మధ్యప్రదేశ్‌లో టాలెంట్‌ను వెతికి మరీ వెలుగులోకి తీసుకొస్తున్నారు.