
ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ మార్కెట్‌లో అనిశ్చితి మాత్రం ఇంకా తగ్గలేదు. ఉదయం ట్రేడింగ్‌లో MCXలో మే డెలివరీ గోల్డ్ 10 గ్రాములకు రూ.1,48,649 వద్ద స్వల్పంగా పెరిగి ట్రేడ్ అవుతుండగా, వెండి కూడా కొద్దిగా లాభపడి కిలో రూ.2,38,578 వద్ద ఉంది. ప్రపంచ స్థాయిలో చూస్తే బంగారం మళ్లీ కొంత బలపడటానికి ప్రధాన కారణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను జాగ్రత్తగా మారుస్తున్నాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతంలో ఉన్న అనిశ్చిత పరిస్థితి కూడా కీలక అంశం. ఇది ప్రపంచ చమురు సరఫరాలో ప్రధాన మార్గం కావడంతో, ఇక్కడ ఏ అంతరాయం వచ్చినా చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరగొచ్చు, ఇది సాధారణంగా బంగారానికి మద్దతు ఇస్తుంది.
అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌ను మరింత అప్రమత్తంగా మార్చాయి. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, కాల్పుల విరమణ దిశగా కదలికలు ఉన్నాయని సంకేతాలు రావడంతో, భవిష్యత్ ధరలపై స్పష్టత కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. మరో కీలక అంశం కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు. ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపుతుంది. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే బంగారం ఆకర్షణ తగ్గుతుంది, తగ్గితే లేదా స్థిరంగా ఉంటే బంగారం బలపడుతుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా తన విధానాలను స్థిరంగా ఉంచడం గమనార్హం.
ఇప్పుడే పెట్టుబడి పెట్టాలా?
ప్రస్తుతం మార్కెట్ వేచి చూద్దాం అనే మూడ్‌లో ఉంది. ధరలు పెద్దగా మారకుండా ఒక రేంజ్‌లోనే ఉన్నాయి. కాబట్టి చిన్న మొత్తాల్లో SIP విధానంలో కొనుగోలు చేయడం మంచిది, ఒకేసారి పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం కాస్త రిస్క్, ఫెడ్ నిర్ణయం, అమెరికా, ఇరాన్ పరిణామాలు వచ్చిన తర్వాత క్లియర్ ట్రెండ్ కనిపించే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి