
Registered Will Deed: నేటి కాలంలో ఆస్తుల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా తోబుట్టువుల మధ్య వివాదాలు రావడం సర్వసాధారణమైపోయింది. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తి, వారి తర్వాత పిల్లల మధ్య చిచ్చు పెట్టకుండా ఉండాలంటే ‘వీలునామా’ (Will Deed) అనేది ఒక బలమైన ఆయుధమని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పేరు మీద ఉన్న ఆస్తిని పిల్లలకు ఎలా పంపిణీ చేయాలనేది తరచుగా ఎదురయ్యే ప్రశ్న. కొందరు పిల్లలు ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు పొంది, స్వతహాగా సంపాదనపరులైనప్పటికీ, తల్లిదండ్రుల ఆస్తిపై ఆశ పడేవారు చాలా మంది ఉంటారు. అదే సమయంలో, మరికొందరు ఎటువంటి సంపాదన లేకుండా, తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిపైనే పూర్తిగా ఆధారపడతారు. ఇలాంటి భిన్నమైన పరిస్థితులలో, ఆస్తి పంపకాలు కుటుంబంలో కలహాలకు దారితీయకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ముందుగానే సరైన నిర్ణయాలు తీసుకోవాలని అడ్వకేట్ రమ్య సూచిస్తున్నారు.
ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులు అనుసరించాల్సిన ముఖ్యమైన విధానం రిజిస్టర్డ్ వీలునామా (Registered Will Deed) చేసుకోవడం. వీలునామా రాయడం ద్వారా, ఆస్తిని ఎవరికి, ఏ మేరకు ఇవ్వాలనేది తల్లిదండ్రులు స్పష్టంగా పేర్కొనవచ్చు. దీని వల్ల వారి తదనంతరం పిల్లల మధ్య ఆస్తి కోసం ఎటువంటి తగాదాలు తలెత్తకుండా నివారించవచ్చు. ఒకవేళ వీలునామా లేకపోతే, వారసులు చట్టబద్ధమైన హక్కుల కోసం కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కుటుంబ సంబంధాలను దెబ్బతీయడంతో పాటు, ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది.
రిజిస్టర్డ్ వీలునామా గురించి తల్లిదండ్రులలో ఒక సాధారణ అపోహ ఉంది. వీలునామా రాసిన తర్వాత ఆ ఆస్తిని అమ్ముకోవడానికి లేదా మార్చుకోవడానికి అవకాశం ఉండదని చాలా మంది భావిస్తారు. అయితే, వీలునామా అనేది మీ తదనంతరం మాత్రమే అమలులోకి వస్తుంది. అంటే తల్లిదండ్రులు బతికి ఉన్నంత కాలం ఆ ఆస్తిపై వారికి పూర్తి హక్కు ఉంటుంది. ఒకవేళ వీలునామాలో పది రూపాయల ఆస్తిని పంపిణీ చేయాలని రాసి, తర్వాత ఐదు రూపాయల ఆస్తిని అమ్మాల్సిన అవసరం వచ్చినా, మిగిలిన ఐదు రూపాయల ఆస్తి మాత్రమే వారసులకు చెందుతుంది. అందుకే వీలునామా రాసిన తర్వాత కూడా తల్లిదండ్రులు తమ ఆస్తిని తమ అవసరాల మేరకు వాడుకునే లేదా మార్చుకునే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
సీనియర్ అడ్వకేట్స్ సీనియర్ సిటిజన్‌లకు తల్లిదండ్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరోగ్యంగా, స్పృహతో ఉండగానే వీలునామాలు రాసుకోవడం చాలా ముఖ్యం. ఇది వారి ఆస్తి పంపకాలను చట్టబద్ధంగా, పారదర్శకంగా చేస్తుంది. ఇండియన్ లా ప్రకారం.. ఆస్తి పంపకాలలో తలెత్తే సమస్యలను తగ్గించడానికి రిజిస్టర్డ్ వీలునామా ఒక బలమైన చట్టబద్ధమైన పత్రం. ఇది వారసుల హక్కులను పరిరక్షించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో తల్లిదండ్రుల హక్కులను కూడా కాపాడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, న్యాయపరమైన చిక్కులను నివారించడానికి రిజిస్టర్డ్ వీలునామా అత్యంత కీలకమైన పత్రం.
రిజిస్టర్డ్ వీలునామా వల్ల కలిగే ప్రయోజనాలు:
- వివాదాలకు చెక్: మీరు ఏ ఆస్తిని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో స్పష్టంగా వీలునామాలో పేర్కొనడం వల్ల భవిష్యత్తులో తగాదాలు రావు.
- అమ్మే హక్కు మీదే: “ఒకసారి వీలునామా రాస్తే ఆ ఆస్తిపై నాకు హక్కు పోతుందేమో” అని చాలా మంది భయపడుతుంటారు. కానీ వీలునామా అనేది మీ మరణానంతరం మాత్రమే అమలులోకి వస్తుంది. మీరు బతికున్నంత కాలం ఆ ఆస్తిపై పూర్తి హక్కు మీకే ఉంటుంది. ఒకవేళ మీకు అవసరమైతే ఆ ఆస్తిని అమ్ముకోవచ్చు కూడా.
- కోర్టు ఇబ్బందులు ఉండవు: రిజిస్టర్డ్ వీలునామా ఉండటం వల్ల వారసులకు లీగల్ సమస్యలు తగ్గుతాయి. వారసత్వ ధృవీకరణ పత్రాల కోసం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
- నియర్ సిటిజన్లు, తల్లిదండ్రులు తమ ఆరోగ్యం బాగున్నప్పుడే, ఆలోచనా శక్తి ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకోవాలి. మీరు తీసుకునే ఈ చిన్న జాగ్రత్త మీ పిల్లల మధ్య ప్రేమానురాగాలను కాపాడుతుంది.
ఇది కూడా చదవండి: Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి.. భారీగా తగ్గిన ధరలు.. ఎంత తగ్గిందంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి