
విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి దగ్గుబాటి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఒక ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మొదట అనుకున్న హర్షవర్ధన్ రమేశ్వర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. మరి క్రియేటివ్ డిఫరెన్స్ వలన బయటకు వచ్చారా లేదా డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఆయన ఈ టీమ్ నుంచి వైదొలిగార అనేది క్లారిటీగా తెలియరాలేదు.
హర్షవర్ధన్ తప్పుకోవడంతో ఆ బాధ్యతను త్రివిక్రమ్ ఆస్థాన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ రంగంలోకి దిగారు. త్రివిక్రమ్ సినిమాలకు తమన్ అందించే సంగీతం ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘అల వైకుంఠపురములో’, ‘గుంటూరు కారం’ అరవింద సమేత వీరరాఘవ వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో మరో మ్యాజిక్ రిపీట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. తాజాగా తమన్‌తో కలిసి త్రివిక్రమ్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత వెంకటేష్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో రాబోతుండటందానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే లేదా జూన్ కల్లా టోటల్ షూట్ ఫినిష్ కానుందని సమాచారం. తమన్ ఎంట్రీతో ఈ సినిమా ఆడియో మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.