
PM Modi: భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన తర్వాత, తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ యూరప్ పర్యటనకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. వచ్చే నెలలో 4 యూరప్ దేశాల్లో ప్రధాని పర్యటన ఉండబోతోంది. నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలో ఆయన పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నార్వేలో జరిగే భారత్-నార్డిక్ సదస్సుకు ప్రధాని మోడీ హాజరవ్వనున్నారు.
Read Also: Mega El Nino: 149 ఏళ్ల తర్వాత ‘‘మెగా ఎల్ నినో’’.. భారత్‌లో కరువు తప్పదా..?
ఈ అధికారిక పర్యటన మే 15 నుంచి 20 వరకు జరిగే అవకాశం ఉంది. ముందుగా నార్వేలో పర్యటించిన తర్వాత స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలను సందర్శించనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ యుద్ధం, హార్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు మధ్య మోడీ యూరప్ పర్యటన ఉండబోతోంది. ఈయూ-భారత్ ఒప్పందం కుదిరిన ఒప్పందాన్ని ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’గా అభివర్ణిస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల భారత్, యూరోపియన్ దేశాల వాణిజ్యం మరింత పెరుగనుంది. ఈ ట్రేడ్ డీల్ కుదిరిన తర్వాత తొలిసారిగా మోడీ యూరప్ పర్యటనకు వెళ్తున్నారు.