Reading Time: < 1 minute
Stock Market Surges Iran Us Peace Talk Hopes Sensex Nifty Gain

దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో దూసుకెళ్తోంది. ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరగవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్‌కు జోష్ వచ్చింది. నిన్న ప్రారంభంలో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. ఈరోజు మాత్రం భారీ లాభాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరగవచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహం వచ్చింది.

ఇది కూడా చదవండి: Iran-US: రేపటితో ముగుస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం.. మళ్లీ మధ్యప్రాచ్యంలో యుద్ధం తప్పదా?

ప్రస్తుతం సెన్సెక్స్ 324 పాయింట్లు లాభపడి 78, 844 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 88 పాయింట్లు లాభపడి 24, 453 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడగా.. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేర్లు నష్టపోయాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: 2 States Elections: నేటితో బెంగాల్, తమిళనాడులో ముగియనున్న ప్రచారం.. ఎల్లుండి ఓటింగ్