Reading Time: 2 minutes
Cream Cheese Kunafa Recipe At Home Easy Middle Eastern Dessert Making Style Here

Cream Cheese Kunafa Recipe: మధ్యప్రాచ్య (Middle East) వీధుల్లో గుమగుమలాడే అద్భుతమైన రుచి ఇప్పుడు మన భారతీయ ఆహార సంస్కృతిలో ఒక భాగంగా మారిపోయింది. అరబిక్ డెసర్ట్స్‌ లో ‘కునాఫా’ కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. అందుకే దీనిని ‘డెసర్ట్స్ రాణి’ అని పిలుస్తుంటారు. ఒకప్పుడు కేవలం విదేశాల్లో లేదా ఖరీదైన రెస్టారెంట్లలో మాత్రమే కనిపించే ఈ గోల్డెన్ కలర్ స్వీట్, ఇప్పుడు హైదరాబాద్ వంటి నగరాల్లో ఫుడ్ లవర్స్‌ కు మోస్ట్ ఫేవరెట్ ఐటమ్‌గా మారిపోయింది. పైన క్రంచీ లేయర్, లోపల క్రీమీ టెక్చర్, పైన షుగర్ సిరప్‌ తో జ్యూసీగా ఉండే ఈ స్వీట్ అంటే అందరికీ ఇష్టమే.

పైన కరకరలాడే లేయర్, లోపల మెల్ట్ అయ్యే క్రీమీ చీజ్, పైన తీయని షుగర్ సిరప్.. ఈ మూడింటి కలయిక నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. చూడటానికి ఎంతో క్లిష్టంగా కనిపించే ఈ రాయల్ డెసర్ట్‌ ను ఇంట్లోనే పర్ఫెక్ట్‌ గా తయారు చేయడం చాలా సులభం. మరి ఇంతటి రిచ్ డెసర్ట్‌ ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

LSG కొంపముంచిన Aiden Markram ఓవర్.. IPL 2026లో అత్యంత ఖరీదైన ఓవర్ నమోదు.!

కావలసిన పదార్థాలు:
* కునాఫా సేమియా: మార్కెట్‌లో లేదా ఆన్‌లైన్‌లో దొరికే సన్న సేమియా.
* బటర్: కరిగించిన వెన్న.
* క్రీమ్ తయారీకి: పాలు, మిల్క్ పౌడర్, కార్న్ ఫ్లోర్, పంచదార, ఫ్రెష్ క్రీమ్, వెనిల్లా ఎసెన్స్ (లేదా యాలకుల పొడి).
* షుగర్ సిరప్: పంచదార, నీళ్లు, నిమ్మరసం.
* చీజ్: మోజరెల్లా చీజ్.
* గార్నిషింగ్: పిస్తా ముక్కలు.

తయారీ విధానం:
సేమియా ప్రిపరేషన్:
మొదట కునాఫా సేమియాను తీసుకుని చేతితో చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఇందులో కరిగించిన బటర్ వేసి ప్రతి సేమియా పోగుకు వెన్న బాగా పట్టేలా కలుపుకోవాలి.

క్రీమీ స్టఫింగ్:
ఒక పాన్‌లో అర కప్పు పాలు, రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా పంచదార, రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసి ఉండలు లేకుండా కలపాలి. దీనిని స్టవ్ మీద పెట్టి లో-ఫ్లేమ్‌లో చిక్కబడే వరకు ఉడికించాలి. చివరగా వెనిల్లా ఎసెన్స్ కలిపి పక్కన పెట్టుకోవాలి.

Hit and Run Accident: కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్.. బెంజ్ కార్ ఢీకొని యువకుడు మృతి.!

షుగర్ సిరప్:
అర కప్పు పంచదారలో అర కప్పు నీళ్లు పోసి మరిగించాలి. గులాబ్ జామున్ పాకంలా కొంచెం స్టిక్కీగా వచ్చాక, నిమ్మరసం కలిపి దించేయాలి. నిమ్మరసం వేయడం వల్ల పాకం గడ్డకట్టకుండా ఉంటుంది.

కునాఫా సెట్టింగ్:
ఒక ఫ్లాట్ బేకింగ్ ట్రే లేదా పాన్‌కు బటర్ రాసి, ముందుగా సగం సేమియా మిశ్రమాన్ని ఒక లేయర్‌లా వేసి గట్టిగా ప్రెస్ చేయాలి. దానిపై సిద్ధం చేసుకున్న క్రీమ్‌ను స్ప్రెడ్ చేసి, పైన మోజరెల్లా చీజ్ వేయాలి. ఇప్పుడు మిగిలిన సేమియాను పైన వేసి పూర్తిగా కవర్ చేయాలి.

రోస్టింగ్, సర్వింగ్:
దీనిని స్టవ్ మీద లేదా ఓవెన్‌లో లో-ఫ్లేమ్‌లో రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నెమ్మదిగా కాల్చుకోవాలి. అది వేడిగా ఉన్నప్పుడే ప్లేట్‌లోకి తీసుకుని, పైన షుగర్ సిరప్‌ను పోయాలి. చివరగా పిస్తా ముక్కలతో గార్నిష్ చేస్తే నోరూరించే క్రీమ్ చీజ్ కునాఫా రెడీ. ఇలా రెడీ అయినా కునాఫాను వేడి వేడిగా తింటేనే లోపల చీజ్ మెల్ట్ అవుతూ అద్భుతమైన రుచిని ఇస్తుంది.