
దృశ్యం.. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఓ సెన్సేషన్. మొదటి రెండు పార్టులతో అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ.. ఇప్పుడు మూడో పార్ట్ విషయంలో డిఫరెంట్ రిజల్ట్స్ ఫేస్ చేసింది. సౌత్‌లో వచ్చిన దృశ్యం 3కి ఊహించని విధంగా నెగెటివ్ టాక్ వస్తే.. నార్త్‌లో అజయ్ దేవగన్ నటించిన ‘దృశ్యం ది కంక్లూజన్’ మాత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ డిఫరెంట్ టాక్‌కు రీజనేంటి..? రిలీజ్‌కు ముందు దృశ్యం 3 సౌత్ వర్షన్ మీద అంచనాలు నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. జార్జ్ కుట్టి మళ్లీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో, పోలీసుల నుంచి ఫ్యామిలీని ఎలా సేవ్ చేస్తాడో అని అంతా వెయిట్ చేశారు. కానీ రిలీజ్ తరువాత సీన్ రివర్స్ అయింది. రొటీన్ ట్విస్టులు, సాగదీత స్క్రీన్ ప్లేతో సౌత్ ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ కావడంతో.. మొదటి ఆటకే నెగెటివ్ టాక్ మూటగట్టుకుంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ మాత్రం ఈ మూవీతో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. సౌత్ కథను ఉన్నది ఉన్నట్టుగా దించేయకుండా.. హిందీ నేటివిటీకి, అక్కడి ఆడియన్స్ పల్స్‌కు తగ్గట్టుగా మేకర్స్ చేసిన మార్పులు బాగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా విజయ్ సల్గాంకర్ ఫ్యామిలీ ఎమోషన్స్‌ను పీక్స్‌లో ప్రొజెక్ట్ చేస్తూ.. క్లైమాక్స్‌లో ఇచ్చిన అదిరిపోయే ట్విస్ట్ హిందీ ఆడియన్స్‌కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నార్త్‌లో ఏ రేంజ్ డామినేషన్ చూపిస్తోందంటే.. కేవలం రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. కథలో చేసిన ఛేంజెస్ వర్కవుట్ అవ్వడంతో.. దృశ్యం సిరీస్‌కు సౌత్ కన్నా హిందీ మేకర్సే సరైన ముగింపు ఇచ్చారంటున్నారు ఆడియన్స్. ఒకే ఫ్రాంచైజీ, ఒకే కోర్ పాయింట్.. కానీ రిజల్ట్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్. రిలీజ్‌కు ముందున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అవ్వడంలో సౌత్ మేకర్స్ తడబడితే.. హిందీ వర్షన్ మాత్రం పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ గ్రిప్పింగ్ నెరేషన్‌తో ఫుల్ డామినేషన్ చూపిస్తోంది. మొత్తానికి ‘దృశ్యం ది కంక్లూజన్’ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం
గాల్లో 28 వేల అడుగులకు పడిపోయిన విమానం.. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో ఎమర్జెన్సీ
భూమి పై భారీ ఉల్కాపాతం..! ఆ జీవరాశుల అంతానికి, దీనికి సంబంధమేంటి?
దృశ్యం సినిమా తరహాలో తండ్రిని చంపేసాడు.. చివరికి
శివాలయంలో అద్భుత దృశ్యం..శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు