Reading Time: < 1 minute
Bhagyashri Borse: తొలి బ్లాక్‌బస్టర్‌తో భాగ్యశ్రీ బోర్సే దశ తిరిగింది.. బిగ్‌ ఛాన్స్‌ కొట్టిన ముద్దుగుమ్మ

రీసెంట్‌గా కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే, బిగ్ స్క్రీన్స్‌తో పాటు స్మార్ట్ స్క్రీన్స్ మీద కూడా జోరు చూపిస్తున్నారు. ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే మరో వైపు ఆన్‌లైన్‌ అప్‌డేట్స్‌తోనూ రచ్చ చేస్తున్నారు. రీసెంట్‌ టైమ్స్‌లో ఈ బ్యూటీ సోషల్ మీడియా యాక్టివిటీ కూడా టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’తో సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమయ్యారు భాగ్యశ్రీ బోర్సే. తన గ్లామర్‌ గ్రేస్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ కెరీర్‌ స్టార్టింగ్‌లో సక్సెస్‌ విషయంలో తడబడ్డారు. రీసెంట్‌గా లెనిన్ సినిమాతో కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్‌ అందుకున్న ఈ భామ ఆ సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో టాలీవుడ్‌ను ఫిదా చేసింది. ఆ సక్సెస్‌ తరువాత ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే తెలుగులో యంగ్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటున్న ఈ భామ.. మలయాళ ఇండస్ట్రీలోకి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసి లక్కీ గర్ల్ అనిపించుకుంటున్నారు భాగ్యశ్రీ. ఆపరేషన్‌ గంగ మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న ఈ భామ అక్కడ తొలి సినిమానే మోహన్‌ లాల్ టాప్ హీరోతో నటించే ఛాన్స్ రావటంతో సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. బిగ్‌ స్క్రీన్ మీద ఇంత బిజీగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తగ్గేదే లే అంటున్నారు. మూవీ విశేషాలతో పాటు వెకేషన్ అప్‌డేట్స్‌తోనూ ఫ్యాన్స్‌ను ఎంగేజ్‌ చేస్తున్నారు ఈ బ్యూటీ… దీంతో ఆన్‌లైన్‌లో కూడా భాగ్యశ్రీ క్రేజ్‌ నెక్ట్స్ లెవల్‌లో కనిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం

గాల్లో 28 వేల అడుగులకు పడిపోయిన విమానం.. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌లో ఎమర్జెన్సీ

భూమి పై భారీ ఉల్కాపాతం..! ఆ జీవరాశుల అంతానికి, దీనికి సంబంధమేంటి?

దృశ్యం సినిమా తరహాలో తండ్రిని చంపేసాడు.. చివరికి

శివాలయంలో అద్భుత దృశ్యం..శివలింగం చుట్టూ నాగుపాముల ప్రదక్షిణలు