Reading Time: < 1 minute

RTC విలీనంతో పాటు, అన్ని సమస్యలకు పరిష్కారం: RTC ఎన్నికల ప్రచారంలో పీసీసీ చీఫ్

Caption of Image.

విలీనంతో పాటు, మిగతా సమస్యల పరిష్కారానికి సహకరించాలనే ఉద్దేశంతోనే ఎన్నికలకు సిద్ధంమయ్యామని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. విలీనం శాస్త్రీయ బద్దంగా జరలాగలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. RTC ఎన్నికల్లో TWU కు కాంగ్రెస్ మద్దతు ఉందని.. RTC పై సీఎం రేవంత్ ఆశీస్సులు ఉన్నాయన్నారు.

2026 అక్టోబర్ 7న RTC ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న ఆయన.. రాష్ట్రం లో జరుగుతున్న పెద్ద ఎన్నిక ఇది అని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కార్మికుల పక్షపాతి అని చెప్పారు. ఆటో కార్మికుల సమస్యలు, గిగ్ వర్కర్ ల సమస్యలకు పరిష్కారం చూపామని తెలిపారు.

ఆర్థికంగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ 1 వ తేదీనే జీతాలు వేస్తున్నామని తెలిపారు. పేదలను, కార్మికులను  ఆదుకోవడం కాంగ్రెస్ పార్టీ పునాదుల్లో ఉందన్నారు. 10 ఏళ్లలో నియంత పాలన తో ఎలాంటి ఇబ్బందుకు ఎదుర్కొన్నారో అందరికీ తెలుసన్నారు. ఇప్పుడు దొంగచాటున పక్క కూటమికి సపోర్ట్ చేస్తుందని విమర్శించారు. ఆ ప్రయత్నాలను ఎన్నికల్లో తిప్పి కొట్టాలని.. అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించారు. 

Twu గెలవాల్సిన అవసరం ఉందన్నారు పీసీసీ చీఫ్. Rtc కార్మికులకు pcc చీఫ్ గా సపోర్ట్గా ఉంటానన్నారు. Cm మాటగా చెబుతున్న RTC విలీనం తో పాటు, అన్ని సమస్యల పరిష్కారం చేసుకుందామని అన్నారు. గత ప్రభుత్వం పాలనలో ఒకే కుటుంబానికి అన్ని పదవులు వచ్చాయని.. ఇప్పుడు బీసీ, sc, st లను పదవుల్లో నిలబెట్టి..కడుపులో పెట్టుకున్నామని తెలిపారు. బాణం గుర్తుకు ఓటు వేసి twu ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 

©️ VIL Media Pvt Ltd.