Reading Time: < 1 minute
Young Directors Focus Seems To Be On Nandamuri Balakrishna

యంగ్ డైరెక్టర్స్ ఫోకస్ అంతా ప్రజెంట్ బాలకృష్ణపైనే పడినట్లుంది. గోపీచంద్ మలినేని తర్వాత బాలయ్యతో వర్క్ చేసేందుకు క్యూ కడుతున్నారు. వివేక్ ఆత్రేయ, విజయ్ కనక మేడల, వశిష్ట వరకు పలువురు పేర్లు వినిపించాయి. కానీ వివేక్ ఆత్రేయకు గాడ్ ఆఫ్ మాసెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. వివేక్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చి ఓకే చెప్పారట బాలకృష్ణ. నానికి సరిపోదా శనివారంతో హిట్టిచ్చిన వివేక్ ఆత్రేయ.. ఆ తర్వాత తెలుగు హీరోలను కాదని తమిళ స్టార్స్ వెంటపడుతూ టైంపాస్ చేశాడు.

Also Read : Tollywood : రిలీజయ్యాక ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేస్తోన్న హీరోస్

రజనీకాంత్, సూర్యకు కథ చెప్పినప్పటికీ వర్కౌట్ కాలేదు. తమిళ హీరోలతో సెట్టయ్యేట్టు లేదని బాలకృష్ణ కథ చెప్పి గోల్డెన్ ఆఫర్ కొల్లగొట్టాడు. గాడ్ ఆఫ్ మాసెస్ యస్ చెప్పడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడట డైరెక్టర్. వీర సింహా రెడ్డి తర్వాత మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించనుందని టాక్.  బాలయ్యతో గ్యాంగ్ స్టర్ డ్రామా చేస్తున్నాడట వివేక్ ఆత్రేయ. అయితే ఈ సినిమాలో కీ రోల్ కోసం మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్‌ను డైరెక్టర్ తీసుకురావాలనుకుంటున్నట్లు టీఎఫ్ఐ ఇన్నర్ టాక్. ఆయన డేట్స్ కోసం ట్రై చూస్తున్నాడట. ఇదే నిజమైతే.. 30 ఇయర్స్ తర్వాత ఓ రేర్ కాంబినేషన్ సెట్ అయినట్లే. గతంలో ఈ లెజండరీ కలిసి నటించారు. 1994లో వచ్చిన గాంఢీవంలో ఓ పాటలో అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత అబ్బాయి తారక్‌తో జనతా గ్యారేజ్‌లో ఫుల్ లెంత్ రోల్‌లో మెరిశారు లాలట్టన్. మళ్లీ ఇన్నాళ్లకు బాలయ్య- మోహన్ లాల్ కాంబో సెట్టయితే.. ఆడియన్స్‌‌కు ఐ ఫీస్ట్ ఖాయమే..