Reading Time: < 1 minute
Revanth Reddy Comments On Tdp Bjp Alliance Chandrababu Future

CM Revanth Reddy: బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీల మనగడ భవిష్యత్తులో కష్టంగా ఉంటుందని.. టీడీపీ, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అలాగే అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో మీడియాలో మాట్లాడిన నితీష్ కుమార్, ఏక్ నాథ్ షిండేలను ఉదాహరిచారు. భవిష్యత్తులో టీడీపీ, చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే అవుతుందని జోష్యం చెప్పారు. ప్రస్తుతం బీజేపీకి కేంద్రంలో సీట్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి టీడీపీకి ఇంపార్టెన్స్ ఇస్తోందన్నారు. భవిష్యత్తులో బీజేపీ బలం పెరిగితే టీడీపీని తీసి పక్కన పడేస్తారన్నారు. లోక్‌సభ, రాజ్యసభ ఉన్నది చట్టాలు చేయడానికి మాత్రమే.. వాటిని ఇంప్లిమెంట్ చేసేది స్థానికంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు అధికార యంత్రాంగమని సీఎం తెలిపారు. 2/3 మెజార్టీ వచ్చినంత మాత్రాన అన్నింటిని చట్టాలు చేయలేమని, కేంద్రంలో మెజార్టీ ఉందని ప్రధానిగా ఉన్న ఎవరైనా తనకు తనకు రాజుగా 2/ 3 మెజార్టీతో చట్టం చేసుకుంటే ఒప్పుకోరు కదా? అని ప్రశ్నించారు. డిక్టేటర్ షిప్‌ని ఎవరు ఒప్పుకోరు.. ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్‌కి కేవలం 11 సీట్లే ఉన్నాయన్నారు. అలా అని ఆంధ్రప్రదేశ్‌కు నేను రాజు అని చంద్రబాబు నాయుడు చట్టం తీసుకొస్తే ఒప్పుకుంటారా..? అని ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.