Reading Time: < 1 minute
దేశానికి కొత్త దిశను ఇవ్వబోతున్నాం.. మహిళలకు నిర్ణయాధికారం ఉండాలనేదే మా లక్ష్యంః ప్రధాని మోదీ

మహిళా రిజర్వేషన్లపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కీలక ప్రసంగం చేస్తున్నారు. “నేను సభకు వాస్తవాలు, తర్కంతో కూడిన సమాచారాన్ని అందిస్తాను. ఇది దేశానికి చాలా ముఖ్యమైన రోజు. దీనిని 20-25 ఏళ్ల క్రితమే ఆమోదించి ఉండాల్సింది” అని అన్నారు. దేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలుంటాయి. ఇది అలాంటి సమయమే అని ప్రధాని మోదీ అన్నారు. 30 ఏళ్ల క్రితం ఆమోదించాల్సిన బిల్లు ఇప్పుడు సభ ముందుకు వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. మహిళలకు నిర్ణయాధికారం ఉండాలనేదే మా లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు.