
కాకినాడ జిల్లా తుని మండలం వి.కొత్తూరు గ్రామంలో జరుగుతున్న తలుపులమ్మ అమ్మవారి గంధావాస్య ఉత్సావాల్లో సైకత శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శివపార్వతులు, తలుపులమ్మ అమ్మవారి రూపాల్లో రూపొందించిన ఈ శిల్పాలు భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నుంచి ఉగాది పురస్కారం అందుకున్న దేవిన సిస్టర్స్ ఈ అద్భుత కళాకృతులను తీర్చిదిద్దారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట గ్రామానికి చెందిన ఈ యువ సైకత కళాకారులు సుమారు 18 గంటలపాటు శ్రమించి ఈ శిల్పాలను రూపొందించినట్లు తెలిపారు. అమరావతి మాక్స్ క్వాజీ బ్యాంకు సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిల్పాలు జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.జాతర సందర్శకులు ఈ సైకత శిల్పాలను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.