బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి కంపెనీలు భారీగా ఆఫర్లు, డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి. త్వరలో అక్షయ తృతీయ వస్తున్న క్రమంలో వినియోగదారులను ఆకర్షించి సేల్స్ పెంచుకునేందుకు ప్రధాన కంపెనీలు బంపర్ ఆఫర్లను తీసుకొస్తున్నాయి. ఏప్రిల్ 19న అక్షయ తృతీయ వస్తోంది. ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని అందరూ నమ్ముతారు. ఈ సందర్బంగా సేల్స్ కూడా భారీగా పెరుగుతాయి.
ఈ పండుగను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు ఫ్రీబుకింగ్, క్యాష్ బ్యాక్ వంటి ప్రయోజనాలను ప్రకటిస్తున్నాయి. బంగారం ధరలను ముందుగానే లాక్ చేసుకునే సుదుపాయాన్ని తనిష్క్, జాయ్ లుక్కాస్, మలబార్ వంటి ప్రముఖ కంపెనీలు కల్పిస్తున్నారు. అంటే ముందుగానే ధర లాక్ చేసుకుంటే కొనుగోలు చేసే సమయంలో ధర పెరిగినా మీరు ఎంచుకున్న ధరకే కొనుగోలు చేయవచ్చన్నమాట. దీని వల్ల ధర పెరిగినా మీకు భయం ఉండదు.
ఇక మేకింగ్ ఛార్జీలపై కంపెనీలు తగ్గింపును ప్రకటిస్తున్నాయి. బంగారం, స్టడ్ ఆభరణాలపై 30 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నాయి. ఇక వజ్రాలపై కూడా ప్రత్యేక తగ్గింపు ప్రకటిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్లు కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక బంగారం కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్, గిఫ్ట్ వోచర్లను కూడా అందిస్తోంది. బంగారం, వెండి లాంటివి కొనుగోలు చేస్తే విలువైన వోచర్లను ఇస్తున్నాయి.
ఈ వోచర్ల ద్వారా తర్వాత బంగారం కొనుగోలు చేసేటప్పుడు తగ్గింపును పొందవచ్చు. బంగారం, వెండి, వజ్రాలకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఇక బంగారం కొనుగోళ్లకు ఫ్రీ బుకింగ్ ఆప్షన్ కూడా కల్పిస్తున్నాయి. 10 శాతం నుంచి 20 శాతం అడ్వాన్స్ చెల్లించి అడ్వాన్స్ ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. దీని వల్ల ఒకేసారి డబ్బు మొత్తం చెల్లించే బాధ తప్పుతుంది.
అక్షత తృతీయ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు డిమాండ్ పెరుగుతోంది. కంపెనీల వార్షిక టర్నోవర్లో 15 నుంచి 18 శాతం వాటా ఈ పండుగ సందర్భంగా వస్తుంది. ఆఫర్ల వల్ల ఈ ఏడాది కూడా ఆదాయం పొందేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. దీంతో ఈ డిస్కౌంట్స్ ఉపయోగించి కొనుగోలుదారులు ప్రయోజనాలు పొందవచ్చు.




