
వాషింగ్టన్: ‘‘ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. దాన్ని మళ్లీ ఎప్పటికీ తిరిగి తీసుకురాలేరు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు. కానీ బహుశా అది జరిగి తీరుతుంది”.. ఇది ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఫైనల్ వార్నింగ్. మొత్తం ఇరానే నాశనమైపోతుందని ట్రంప్ పేర్కొనడంతో అసలు ఏం జరగబోతుందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎంత చెప్పినప్పటికీ మాట వినకపోవడంతో ఇరాన్‌పై అణు దాడికి అమెరికా సిద్ధమైందని.. ట్రంప్ వ్యాఖ్యల వెనక అర్ధం ఇదేనని సోషల్ మీడియాలో చర్చ ఊపందుకుంది. ఇదే సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ.. అమెరికా దగ్గర ఇంకా బలమైన అస్త్రాలు ఉన్నాయని.. వాటిని ఇప్పటి వరకు ఇరాన్‌పై వాడలేదని.. ఇరాన్ మాట వినకపోతే మాత్రం బహుశా ట్రంప్ వాటిని ఉపయోగించవచ్చని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు వ్యాఖ్యలతో ఇరాన్‌పై అమెరికా న్యూక్లియర్ స్ట్రైక్ చేయడం పక్కా అని జోరుగా చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఇరాన్‌పై అణు దాడి వార్తలపై వైట్ హౌస్ స్పందించింది. ఇరాన్‌పై అణ్వాయుధాలను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలను వైట్ హౌస్ ఖండించింది. ఇరాన్‌పై అణు దాడి చేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యల వెనక అర్ధం అదికాదని వివరణ ఇచ్చింది. దీంతో ఇరాన్‌తో పాటు ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి.
ట్రంప్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశారు. హర్మూజ్ జల సంధి తెరవకపోతే.. ఏం జరుగుతుందో చెప్పేశాడు. ట్రంప్ మాటల్లోనే.. ఈ రాత్రి ఒక నాగరికత మొత్తం అంతరించిపోతుంది. ఇరాన్ దేశాన్ని మళ్లీ పున:నిర్మించలేరు. అలా జరగాలని నేను కోరుకోవటం లేదు. అయినా అదే జరుగుతుంది అంటూ ట్రూత్ పోస్టులో తన స్టాంగ్ ఏంటో స్పష్టంగా చెప్పారు ట్రంప్.
హర్మూజ్ ఓపెన్ కాకపోతే.. ఈ రాత్రికి ఇరాన్ దేశంలో నాగరికత అంతం అవుతుంది అంటూ ఫైనల్ గా స్ట్రాంగ్ మెసేజ్ పంపించారు. ఇరాన్ పాలనలో ఇప్పుడు మార్పు వచ్చింది. భిన్నమైన, తెలివైన, తీవ్రవాద భావజాలం తక్కువగా ఉన్న మనుషులు విజయం సాధిస్తున్నారు. ఈ క్రమంలోనే అద్భుతమైనది ఏమైనా జరగొచ్చు.. ఎవరికి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ కామెంట్ చేశారు ట్రంప్.