Reading Time: 2 minutes

Rohit Sharma: లండన్ అనుకుంటున్నారా.. ఇది గౌహతి బాసూ! రోహిత్ శర్మ ఫన్నీ రియాక్షన్!

Caption of Image.

Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా 2026, ఏప్రిల్ 7 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సిన ఉత్కంఠభరిత పోరుకు వర్షం అడ్డంకిగా మారింది. బర్సపరా క్రికెట్ స్టేడియంలో సాయంత్రం నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం కారణంగా టాస్ వేయడం ఇంకా ఆలస్యమవుతుంది. గౌహతిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.

మైదానమంతా కవర్లతో నిండిపోయింది. వర్షం చినుకులు పడుతుండటంతో కవర్లను తొలగించడం గ్రౌండ్ స్టాఫ్‌కు సవాలుగా మారింది. భారీ వర్షం కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లు కనీసం వార్మప్ కూడా చేసుకోలేకపోయారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన పోరు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. 15 ఏళ్ల ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ (RR), స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (MI) మధ్య జరగబోయే ఆ స్పెషల్ ఫైట్ కోసం సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతోంది. కానీ వర్షం ఈ ఆశలపై నీళ్లు చల్లుతోంది.

వర్షం కొంచెం తగ్గిన ప్రతిసారి గ్రౌండ్ స్టాఫ్ సూపర్ సోపర్లను మైదానంలోకి తీసుకొచ్చి నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ రాత్రి 9 గంటల తర్వాత వర్షం పూర్తిగా తగ్గితే, మ్యాచ్‌ను 10  లేదా12 ఓవర్లకు కుదించి నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం ఏ మాత్రం తగ్గకపోతే మ్యాచ్ రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో ఊపు మీదుండగా, ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌తో మళ్లీ ట్రాక్‌లోకి రావాలని భావిస్తోంది. వరుణుడు శాంతించి మ్యాచ్ జరగాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ కోసం గౌహతి చేరుకున్న ముంబై ఇండియన్స్ జట్టుకు అక్కడి వాతావరణం షాక్ ఇచ్చింది. ఎండలు ఉంటాయనుకుంటే, ఒక్కసారిగా వర్షం పడి చలి పెరగడంతో ఆటగాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఇక ముంబై కెప్టెన్ పాండ్యా చలికి వణికిపోయాడు. ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 
 
హార్దిక్ వణుకు.. రోహిత్ జోక్: 
* హార్దిక్ పాండ్యా: టీమ్ బస్సు ఎక్కుతున్న సమయంలో చలికి హార్దిక్ వణికిపోతూ కనిపించాడు.

* రోహిత్ శర్మ: తనదైన స్టైల్‌లో “బయట ఇంత చలి ఎక్కడి నుంచి వచ్చింది?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

* తిలక్ వర్మ: అసలు మనం గౌహతికి వచ్చామా లేక లండన్ వచ్చామా? అంటూ జోక్ చేశాడు.
 

©️ VIL Media Pvt Ltd.